బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం.. లాభమేంటి..?

First Published Jun 14, 2021, 10:24 AM IST

అసలు ఉదయాన్నే కనీసం అల్పాహారం కూడా తీసుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఓసారి చూద్దాం...

వ్యాయామం చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పలేం. ఎవరికి ఉన్న వీలుని బట్టి.. వారు వ్యామాయం చేసుకోవచ్చు. కొందరు ఉదయాన్నే చేస్తారు.. మరికొందరు సాయంత్రంచేస్తారు. ఏది ఎప్పుడు చేసినా.. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
undefined
అయితే.. అల్పాహారానికి ముందు వ్యాయామం చేయడం వల్ల మాత్రం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఉదయాన్నే కనీసం అల్పాహారం కూడా తీసుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఓసారి చూద్దాం...
undefined
వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాగా.. వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరగుతాయి.
undefined
అయితే.. బ్రేక్ ఫాస్ట్ కి ముందే వ్యాయామం చేయడం వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీలు కరుగుతాయట. మిగిలిన సమయంలో కన్నా.. పరగడుపున వ్యాయామం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట.
undefined
వ్యాయమానికి... మంచి నిద్రకు సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేసేవారు... రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుందని పరిశోధనలో తేలింది.
undefined
సాయంత్రం వ్యాయామం చేసేవారి కన్నా... ఉదయం వ్యాయామం చేసేవారు త్వరగా.. ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని..పరిశోధనల్లో నిరూపితమైంది.
undefined
ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల బలం పెరుగుతుందట. రోజులో సమయం గడుస్తున్న కొద్ది మనిషిలో ఓపిక తగ్గుతుందట. అదే..ఉదయం వేళ అయితే.. చాలా చురుకుగా ఉంటారట. కాబట్టి.. ఆ సమయంలో వ్యాయామం చేయడమే ఉత్తమమైన మార్గమట.
undefined
అంతేకాకుండా.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఏకాగ్రత పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల మరిన్ని ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
click me!