Weight Loss: ఎంత బద్దకంగా ఉన్నా... ఈజీగా బరువు తగ్గించే చిట్కాలు ఇవి..!

First Published Nov 27, 2021, 10:43 AM IST

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో నింపడం చాలా ముఖ్యం.  ఫైబర్ మీ కడుపుని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికను నివారిస్తుంది.  దీంతో.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

weight loss diet

చలికాలం వచ్చిందంటే చాలు.. మనం కొంచెం బద్దకంగా మారిపోతాం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. ఇది నిజం. చలిని తట్టుకోలేక... ఉదయాన్నే లేవలేం. వర్కౌట్స్ చేయలేం. శారీరక శ్రమ తగ్గిపోతుంది.

weight loss

అంతేకాకుండా.. ఈ కాలంలో.. ఎక్కువగా లాగించేయాలని  చూస్తుంటాం. దీంతో.. బరువు పెరిగేస్తూ ఉంటాం. అయితే... ఈ చలికాలంలో ఎంత బద్దకంగా ఉన్నా కూడా.. సులభంగా బరువు తగ్గవచ్చు. ఎంత బద్దకంగా ఉన్నా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


చలి దాదాపు.. ఉదయం వేళ ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఆ సమయంలో వాకింగ్  చేయడం, వర్కౌట్స్ కష్టంగా ఉంటే.. కాస్త చలి తగ్గిన తర్వాత... వర్కౌట్స్ ప్రారంభించాలి. లేదంటే.. సాయంత్రం వేళ.. చలి తక్కువగా ఉన్న సమయంలో... వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాలి. ఈ చలికాలంలో ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. ఈ కాలంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి వీలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

fiber

చలికాలం మనల్ని ఎక్కువగా తినేలా చేస్తుందని నిరూపించబడింది. చల్లని ఉష్ణోగ్రత శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మన రోజువారీ కేలరీల అవసరాలను పెంచుతుంది. కాబట్టి.. ఈ సీజన్ లో మీ ప్లేట్‌ను ఆరోగ్యకరమైన , ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో నింపడం చాలా ముఖ్యం.  ఫైబర్ మీ కడుపుని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికను నివారిస్తుంది.  దీంతో.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇక.. ఈ చలికాలంలో చాలా మంది.. కామన్ గా వేడి నీరు తాగుతూ ఉంటారు. కానీ.. బరువు తగ్గాలి అనుకుంటే.. వేడి నీటికి బదులు.. చల్లని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉండే ద్రవాన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని వేడెక్కడానికి కష్టపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ కిలోల బరువు తగ్గడానికి అవసరమైన చాలా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీరు చల్లటి నీరు త్రాగలేకపోతే, కనీసం సాధారణ నీటిని త్రాగడానికి ప్రయత్నించండి.

herbal tea

ఇక ఈ సీజన్ లో వేడి వేడిగా టీ, కాఫీ తాగడం చాలా మందికి నచ్చుతుంది. అయితే.. పాలు, పంచదార లేకుండా..బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ  లాంటివి తాగాలి. ఊలాంగ్ టీ, మందార టీ, బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది . కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.

మీరు వ్యాయామం కోసం బయటికి వెళ్లకూడదనుకుంటే, ఇంటి లోపల శారీరక శ్రమలో పాల్గొనండి. క్లీనింగ్, వాషింగ్, మాపింగ్, గార్డెనింగ్ , ఇతర వంటి ఇంటి పనులను చేయడం కూడా మీకు గణనీయమైన మొత్తంలో కేలరీలను బర్న్ చేయడంలో  సహాయపడుతుంది. ఇక వర్క్ చేసే సమయంలో కూడా. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి.. లేచి కాసేపు నడిచి.. మళ్లీ కూర్చొని వర్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. 

click me!