జ్ఞాపకశక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు పెరుగుతుంటే.. జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది. ఇది చాలా సహజం. దీనివల్ల విషయాలు గుర్తిండవు. మాట్లాడుతూ.. మాట్లాడుతూ విషయాలను మర్చిపోతుంటారు. అయితే మతిమరుపు సమస్య పెద్దవయసు వారిలోనే కాదు యువతలో కూడా కనిపిస్తుంది. అయితే మెమోరీ పవర్ ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు.కానీ తింటూ కూడా మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..
28
cabbage
మెమోరీ పవర్ ను పెంచేందుకు క్యాబేజీ, బ్రోకలీ, ఉల్లిపాయ, టర్నిప్ వంటి కూరగాయలు కూడా ఎంతో సహాయపడతాయి. ఈ కూరగాయల్లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచి.. మెమోరీ పవర్ ను పెంచేందుకు సహాయపడతాయి.
38
Image: Getty
బీన్స్, కొవ్వు చేపలు, పెరుగు, పాలు, చిక్కుళ్లు, గుమ్మడికాయ విత్తనాలు, బార్లీ, ఓట్స్, గోధుమల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది.
48
బచ్చలికూర, క్యారెట్లు, మొలకలు, చిలగడదుంపలు వంటి ఆహార పదార్థాల్లో కెరోటినాయిడ్లు అని పిలిచే మూలకం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని రోజూ తినండి.
58
సోయాబీన్స్, గుడ్డులోని పచ్చసొన, నువ్వులు, తృణధాన్యాల్లో లెసిథిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కూడా మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ మెమోరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది.
68
చేపలు, గుడ్లు, చికెన్, పాలు వంటి విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచడం, మెమోరీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి.
78
సిట్రస్ పండ్లు అయిన నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి పండ్లతో పాటుగా క్యాప్సికమ్, ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా మీ మెమోరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే మెదడు మరింత మెరుగ్గా పనిచేస్తుంది.
88
cashew
జీడిపప్పు, అంజీర, బాదం పప్పు, వాల్ నట్స్ వంటి గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే కూడా మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెమోరీ పవర్ పెరుగుతుంది. రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.