ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా రకరకాల జబ్బులు ఒకదాని తర్వాత ఒకటి దండయాత్ర చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆడవారిలో పీసీఓడి సమస్య బాగా పెరిగిపోతోంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, తగినంత నిద్ర, ప్రతిరోజూ వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వీటిని ప్రతిరోజూ అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. పిసిఒడి సమస్యతో బాధపడుతున్న మహిళలు రోజుకు 1000 అడుగులు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.