ఈ లోపం చాలా డేంజర్.. పోవాలంటే ఇవి తినాల్సిందే...

First Published Oct 30, 2020, 4:04 PM IST

విటమిన్ డి శరీరానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి, శ్వాసకోవ సమస్యలను దూరం చేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి శాస్వకోశ సమస్యలు తలెత్తుతాయి. 

విటమిన్ డి శరీరానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి, శ్వాసకోవ సమస్యలను దూరం చేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి శాస్వకోశ సమస్యలు తలెత్తుతాయి.
undefined
కరోనా మహమ్మారి నేపధ్యంలో విటమిన్ డి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిమీద అవగాహన బాగా పెరిగింది. విటమిన్ డి ని శరీరంలో తగ్గకుండా ఉండేందుకు అనేక రకా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
undefined
అయితే కోవిద్ 19 నేపధ్యంలో ఇంటికే పరిమితం అవ్వడం, సహజంగా సూర్యుడి నుండి లభించే విటమిన్ డిని పొందలేకపోవడం చాలామందిలో విటమిన్ డి డెఫీషియన్సీని పెంచుతోంది. దీనివల్ల కోవిద్ 19 ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
'ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. స్పెయిన్లోని ఒక ఆసుపత్రిలో చేరిన 216 మంది COVID-19 రోగులలో 80 శాతం విటమిన్ డి లోపం ఉన్నట్లు తేలింది. మహిళల కంటే పురుషుల్లో విటమిన్ డి స్థాయి తక్కువగా ఉందని పరిశోధకులు గమనించారు.
undefined
"విటమిన్ డి-లోపం ఉన్న COVID-19 రోగులకు రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి, సీరం ఫెర్రిటిన్, ట్రోపోనిన్ స్థాయిలను పెంచడం వల్ల ఎక్కువ కాలం ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుంది. అయితే వ్యాధి తీవ్రతను పెంచడంలో డి విటమిన్ లోపం ఉందని తేలలేదని స్పెయిన్లోని మరో రీసెర్చర్ అంటున్నారు.
undefined
'ప్లోస్ వన్' జర్నల్‌లో ప్రచురించబడిన మరో తాజా అధ్యయనం ప్రకారం విటమిన్ డి సమృద్ధిగా ఉన్న రోగుల్లో ఆక్సీజన్ స్థాయిలు తగ్గడాన్ని నిరోధిస్తుందని తేలింది. అంతేకాదు చికిత్స వేగవంతం కావడానికి, త్వరగా కోలుకోవడానికి కూడా ఉపయోగపడిందని తేలింది.
undefined
విటమిన్ డి సహజంగా సూర్యరశ్మినుండి లభిస్తుంది. దీనికోసం ఉదయం, సాయంత్రాలు నీరెండలో ఉండడంతో పాటు విటమిన్ డి అధికంగా దొరికే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
undefined
విటమిన్ డి అధికంగా ఉండే అలాంటి ఆహారపదార్థాలేంటో ఒక్కసారి చూద్దాం.
undefined
కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ట్యూనా, సాల్మన్,మాకేరెల్, ఫిష్ లివర్ ఆయిల్స్ వంటి వాటి ద్వారా విటమిన్ డి ని ఎక్కువగా పొందవచ్చు.
undefined
పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను, కోవా ఇలాంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల డి విటమిన్ లోపం లేకుండా చూసుకోవచ్చు.
undefined
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉంటుందనే భయంతో చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు.
undefined
తృణధాన్యాలు, పళ్ల రసాల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని చేర్చడం వల్ల విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవచ్చు.
undefined
పుట్టగొడుగుల్లో విటమిన్ డి2 పుష్కలంగా ఉంటుంది. వీటిని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థం పుట్టగొడుగులు. స్నాక్స్ గా, భోజనంగా, టిఫిన్ లో.. ఇలా ఏ మీల్ లో నైనా పుట్టగొడుగులను చేర్చవచ్చు.
undefined
click me!