గడువు తీరిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు
శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు ఎక్కువగా ఐదేళ్ల గడువు తేదీని కలిగి ఉంటాయి. అయితే మెన్స్ట్రువల్ కప్పులు చాలా సంవత్సరాలు ఉంటాయి. కానీ ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఖచ్చితంగా ఈ కప్పును మార్చాలి. గడువు తేదీలను చెక్ చేయడం, కాలం చెల్లిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గడువు ముగిసిన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. గడువు తేదీ దాటిన ఉత్పత్తులు బ్లడ్ ను గ్రహించవు. ఇది లీకేజీ, అసౌకర్యానికి దారితీస్తుంది. గడువు ముగిసిన పీరియడ్ ఉత్పత్తుల్లో సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.