aortic aneurysm అంటే ఇదే..
బృహద్ధమని గుండె కండరాల పంపింగ్ చాంబర్ పై భాగంలో ప్రారంభమవుతుంది. గుండె ఎడమ జఠరిక నుండి కవాటం ద్వారా రక్తాన్ని బృహద్ధమనిలోకి పంపుతుంది. బృహద్ధమని ఒక అడుగు పొడవు, ఒక అంగుళం కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గొట్టం లాంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో 3 పొరలు ఉంటాయి. అవి intima, media, adventitia. ఈ మూడు పొరలు రక్తప్రసరణ జరిగే సమయంలో బృహద్ధమని దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇది బలహీనంగా మారడం వల్ల Intima, media పొరలు దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. రక్తం adventitia పొరలోకి చొచ్చుకు వస్తుంది. దీనివల్ల ఆయా శరీర భాగాల్లో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. దీనినే aortic aneurysm అంటారు.
బృహద్ధమని నాలుగు విభాగాలుగా విభజించబడి ఉంది.
1.ఆరోహణ బృహద్ధమని(ascending aorta)
2.బృహద్ధమని వంపు(aortic arch)
3.అవరోహణ థొరాసిక్ బృహద్ధమని(descending aorta)
4.పొత్తికడుపు బృహద్ధమని(abdominal aorta)
* ఆరోహణ బృహద్ధమని.. గుండె పై భాగంలో 2 అంగుళాల పొడవు ఉంటుంది. హృదయ ధమనులు గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఆరోహణ బృహద్ధమని నుండి విడిపోతాయి.
* బృహద్ధమని వంపు.. గుండెపై వక్రంగా ఉంటుంది. ఇది తల, మెడ, చేతులకు రక్తాన్ని తీసుకువచ్చే శాఖలకు దారి ఏర్పాటు చేస్తుంది.
* అవరోహణ థొరాసిక్ బృహద్ధమని.. ఇది ఛాతీ మీదుగా క్రిందికి ప్రయాణిస్తుంది . దీని చిన్న శాఖలు కొన్ని ఛాతీ నిర్మాణాలకు, పక్కటెముకులకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
* పొత్తికడుపు బృహద్ధమని డయాఫ్రాగమ్ వద్ద ప్రారంభమవుతుంది. ఇది దిగువ పొత్తికడుపులో జత చేసిన ఇలియాక్ ధమనులుగా విడిపోతుంది.
అంతర్గత రక్తస్రావంతో ప్రమాదం..
కొన్ని సందర్భాల్లో బృహద్దమని పగిలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం అవుతుంది . వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఏర్పడిన వారిలో 85 శాతం మంది ప్రాణాలు కోల్పో తున్నారు. 66 శాతం మంది ఆసుపత్రికి వెళ్లే లోపే చనిపోతున్నారు.
లక్షణాలు.. చికిత్స..
శరీరంలో ఛాతీ, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. శరీరంపై ఉబ్బినట్లు, వాపు వస్తుంది. దీనికి సర్జరీ ఒక్కటే మార్గం. సర్జరీలో భాగంగా స్టంట్ ద్వారా సన్నటి గొట్టాన్ని బృహద్ధమనిలోకి చొప్పించి రక్త స్రావాన్ని అడ్డుకుంటారు.