పసుపు వల్ల ప్రయోజనాలే కాదండోయ్ దుష్ప్రభావాలు కూడా ఉన్నాయ్.. అవేంటంటే?

First Published Nov 25, 2021, 2:51 PM IST

పసుపు (Turmeric) అల్లం జాతికి చెందిన మొక్క. పసుపు శాస్త్రీయనామం కుర్కుమా లాంగా. ఇది భారత ఉపఖండం, ఆగ్నేయాసియాకు చెందినది. పసుపును మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. పసుపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపును ఆయుర్వేద (Ayurveda) ఔషధాలలో వాడుతారు. పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
 

పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటి నివారణ కొరకు చక్కర ఉపయోగిస్తారు. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ (Antimicrobial), యాంటిక్యాన్సర్ (Anticancer) లక్షణాలు ఉన్నాయి. పసుపును సౌందర్య లేపనంగా కూడా వాడుతుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పసుపు తో కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు, దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం..
 

పసుపు రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల (Cancer cells) విస్తరణను నిరోధిస్తుంది. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగపడుతుంది.
 

కాలేయం పనితీరును మెరుగుపరచడానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి. పసుపులోని కర్కుమిన్ (Curcumin) ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని కాపాడుతుంది. పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ (Diabetes) చికిత్సకు సహాయపడుతుంది.
 

డయాబెటిస్ ను నిరోధిస్తుంది. పసుపులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. పసుపు క్యాన్సర్ ను తగ్గిస్తుంది. నిత్యం మనం పసుపు తీసుకోవడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti - inflammatory) ప్రభావాల కారణంగా గాయాలు (Injuries), దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 

పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను (Heart disease) నివారిస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ, డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి. పసుపులోని కర్కుమిన్ స్థూలకాయానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. ఇది శరీర కొవ్వును (Fat) కరిగించే ప్రక్రియను పెంచుతుందని ఒక పరిశోధనలో తేలింది.
 

పసుపు జీర్ణక్రియను (Digestion) కూడా మెరుగుపరుస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు అన్నవాహికలో కలిగే మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, కాలేయ వ్యాధి, విరేచనాలు వంటి జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.
 

పసుపు మనం నిత్యం తీసుకోవడంతో మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. పసుపు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్ (Pain killer) గా పనిచేస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పిని కూడా తగ్గించే గుణాలు పసుపులో ఉన్నాయి. వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమలు (Pimples), ముడతలను, మృత కణాలను (Dead cells) పసుపు తగ్గిస్తుంది.
 

సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను (Skin problems) తగ్గిస్తుంది. పసుపు రక్తం గడ్డ కట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంటే రెండు వారాల లోపు పసుపును వాడకపోవడం మంచిది. ఐరన్ లోపం ఉన్న వ్యక్తులు అధిక మొత్తంలో పసుపును వాడరాదు. అలాగే మూత్రపిండాలలో (kidneys) రాళ్ళు ఉన్నవారు కూడా పసుపును ఎక్కువగా వాడకపోవడం మంచిది.

click me!