నోటి పూత సమస్యతో ఇబ్బందిపడుతున్నారా అయితే ఒకసారి ఈ చిట్కాలను ట్రై చేయండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 23, 2021, 05:22 PM IST

నోటి పూత (Mouth ulcer) సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఏ పదార్థాలను తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి పూత, నోటిలో పుండ్లు ఏర్పడ్డానికి విటమిన్ బి లోపం కావచ్చు. ఒంట్లో వేడి కూడా కారణం కావచ్చు. ఇలా నోటి పూత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అందరిలో కనిపించే సాధారణ సమస్య. సమస్య చిన్నదే అయినప్పటికీ నోటి పూత ద్వారా నోట్లో పెదాల లోపలివైపు, నాలుక మీద, బుగ్గ లోపల పుండ్లు ఏర్పడి ఏ పదార్థాలను తినాలన్నా చాలా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. చివరికి నీళ్లు తాగిన ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా కారపు పదార్థాలు తిన్నప్పుడు విపరీతమైన మంట (Inflammation) కలిగి మరింత బాధను కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా నోటిపూతను తగ్గించుకోవడానికి పాటించవలసిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..  

PREV
15
నోటి పూత సమస్యతో ఇబ్బందిపడుతున్నారా అయితే ఒకసారి ఈ చిట్కాలను ట్రై చేయండి!

నోటిపూతను తగ్గించడానికి కొబ్బరినూనె (Coconut oil) చక్కగా పనిచేస్తుంది. కొంచెం కొబ్బరి నూనె తీసుకొని పుండ్లపై రాయాలి. ఇలా తరచూ చేస్తే నోటిపూత తొందరగా తగ్గిపోతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ  (Anti-inflammatory) గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటిపూతను తగ్గించడానికి సమర్థవంతంగా పని చేస్తాయి.
 

25

తేనెలో (Honey) సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. తేనెకు ఇన్ఫెక్షన్ తో పోరాడే లక్షణాలు ఉంటాయి. తేనెను పుండ్లు ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. తేనే రాసుకున్న తరువాత అరగంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలను, ద్రవ పదార్థాలను తీసుకోరాదు. ఇలా రోజుకు రెండుసార్లు తేనెను అప్లై చేశారంటే నోటిపూత (Mouth ulcers) త్వరగా తగ్గిపోతుంది.

35
mouth ulcers

నోటి పూత తగ్గడానికి పుల్లటి పెరుగు (Sour yogurt) చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకుని అందులో నీళ్లు కలుపుకొని మజ్జిగలా తయారు చేసుకోవాలి. ఈ మజ్జిగను రోజుకు రెండు, మూడు సార్లు నోట్లో వేసుకుని పుకిలించిన (Pooping) మంచి ఫలితం ఉంటుంది.

45

జామ చెట్టు లేత ఆకులను (Guava tree leaves) నమిలి ఆ రసాన్ని నోటిలో కొద్దిసేపు ఉంచుకుని పుకిలిస్తే నోటిపూత నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు (Basil leaves) యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది.  తులసి ఆకులను రోజుకు రెండు సార్లు నమిలి మింగితే నోటి పూత తగ్గుతుంది.
 

55

ఎండుకొబ్బరి (Coconut), గసగసాలను (Poppy) రెండింటినీ నమిలి తింటే నోటి పూత నుంచి తక్షణ విముక్తి కలుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్ గా  పనిచేస్తుంది. రోజుకు రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ ను తాగడంతో నోటి పూత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

click me!

Recommended Stories