చాలా సన్నగా ఉన్నారా? వీటిని తినండి బరువు పెరుగుతారు..

Published : May 19, 2023, 11:28 AM IST

బరువు ఎక్కువగా ఉంటేనే కాదు.. తక్కువగా ఉన్నా ప్రాబ్లమే. ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువున్నా లేని పోని రోగాలు చుట్టుకుంటాయి. మరి బరువు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?   

PREV
17
చాలా సన్నగా ఉన్నారా? వీటిని తినండి బరువు పెరుగుతారు..

రోజురోజుకూ స్థూలకాయం సర్వ సాధారణమైన సమస్యగా మారిపోయింది. జీవనశైలి రుగ్మతల్లో ఇదీ ఒకటిగా మారుతోంది. అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందన్న ముచ్చట అందరికీ తెలుసు. ఓవర్ వెయిటే కాదు.. తక్కువ బరువు కూడా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే ఉండాల్సిన బరువు ఖచ్చితంగా ఉండాలి. అయితే కొన్ని ఆహారాలు మీరు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే.. 

27

అరటిపండ్లు

బరువు  పెరగడానికి అరటిపండ్లు కూడా ఎంతో సహాయపడతాయి. బరువును సమతుల్యంగా ఉంచాలనుకుంటే పోషకాలు ఎక్కువగా ఉండే అరటిపండుతో మీ రోజును స్టార్ట్ చేయండి. అరటి పండును పాలు లేదా పెరుగుతో కూడా తినొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు పెరగడానికి రెండు నుంచి మూడు అరటిపండ్లను క్రమం తప్పకుండా తినండి. 
 

37
Image: Getty Images

బ్రౌన్ రైస్ 

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ యే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. వైట్ రైస్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ పోషకాలు ఉండవు. వివిధ రకాల బియ్యంలో పిండి పదార్ధం పరిమాణం కూడా మారుతుంది, ఇది జీర్ణక్రియను నిర్ణయిస్తుంది. బ్రౌన్ రైస్ లో తగినంత మొత్తంలో ఫైబర్ తో పాటు ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. మీకు ఇష్టమైన పప్పులతో బ్రౌన్ రైస్ ను క్రమం తప్పకుండా తినండి.
 

47

బంగాళాదుంపలు

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం కొవ్వు కణజాలాన్ని ప్రోత్సహిస్తుంది. ఇదే కాదు చిలగడదుంపలను కూడా తినొచ్చు. ఇది కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు పెరగాలంటే క్రమం తప్పకుండా 100 గ్రాముల బంగాళాదుంపలను తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

57

శెనగలు

చిక్పీస్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని రిపేర్ చేస్తుంది. అలాగే శరీర పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో తగినంత మొత్తంలో ప్రోటీన్ ను నిర్వహించడానికి మంచి మూలం. ప్రోటీన్ కండర ద్రవ్యరాశిని ప్రోత్సహిస్తుంది. అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు శెనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం  కూడా తగ్గుతుంది. 

67

టోఫు, ఇతర సోయా ఉత్పత్తులు

టోఫు, ఇతర సోయా ఉత్పత్తులు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. వీటిలో కరిగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. వీటిని తింటే కూడా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. 

77

ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు వ్యాయామం, యోగా కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారని అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ దీనిలో నిజం లేదు. సాధారణ యోగా, నడక కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అలాగే బలంగా కూడా ఉంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories