పీరియడ్స్, సెక్స్, భావప్రాప్తి.. పురుషులు నమ్మకూడని కొన్ని విషయాలు

First Published May 19, 2023, 10:45 AM IST

మొదటి పీరియడ్ రక్తాన్ని చూసి సొంత సోదరుడే తన సోదరిని చంపేసిన ఘటనతో సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. దీనిపై మగవారికి అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. 
 

తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ కలచివేస్తోంది. మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్ లో జరిగిన ఈ ఘటన అయ్యో పాపం అనిపించేలా చేస్తుంది. అదేంటంటే.. ఒక అమ్మాయికి మొదటిసారి పీరియడ్స్ వచ్చింది. ఆమె బట్టలకు అంటిన రక్తాన్ని చూసిన ఆమె సోదరుడు ఆమెను కొట్టి చంపాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని.. వాళ్లతో తొలిసారి శృంగారంలో పాల్గొనడం వల్లే  తన బట్టలకు రక్తం అంటుకుందని భావించాడట. ఈ వార్త ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సెక్స్ ఎడ్యుకేషన్ పరంగా మన సమాజం ఎంత వెనుకబడి ఉందో ఆలోచించేలా చేసింది. నేటికీ మన దేశంలోని బాలబాలికలకు పీరియడ్స్, సెక్స్ వంటి ప్రాథమిక విషయాలను నేర్పించలేకపోతున్నాం. దేశం టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకుపోతున్నా.. చాలా విషయాల్లో వెనకబడే ఉన్నారు. 

సమాజంలో సెక్స్ గురించి ఇంకా ఎన్నో నిషేధాలు, అపోహలు ఉన్నాయి. ఇవే ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయని నిపుణులు భావిస్తారు. అందుకే అపోహలు, వాస్తవాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.  పీరియడ్స్, సెక్స్, ఉద్వేగానికి సంబంధించిన అపోహలు, వాస్తవాల గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

periods

అపోహ 1 - పీరియడ్స్ గురించి తండ్రి, సోదరుడితో మాట్లాడకూడదు

వాస్తవం: సెక్స్ ఎడ్యుకేషన్ బాలురు, బాలికలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. అప్పుడే అనవసరమైన విషయాలను నమ్మరు. కానీ దీనిపై ఉన్న నిషేదమే ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. పీరియడ్స్ రావడం ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. ఇది జీవసంబంధమైనది కూడా. దీనిగురించి తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా తెలుసుకోవాలి. పిల్లలతో మాట్లాడాలి. దీంతో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏ అమ్మాయి ఇలా అర్థాంతరంగా చనిపోదు. 
 

అపోహ 2: రక్తస్రావం కన్యత్వానికి సంకేతం!

వాస్తవం: మొదటిసారి సెక్స్ చేసినప్పుడు హైమెన్ (కన్నెపొర) చిరిగిపోతుంది. అందుకే అప్పుడు రక్తస్రావం అవుతుందనే విషయాన్ని చాలా మంది నమ్ముతారు. కానీ దీనిలో ఇంతకూడా నిజం లేదు. హైమెన్  చిరిగిన ప్రతిసారీ రక్తస్రావం జరగదు. హైమెన్ సెక్స్ తో మాత్రమే కాదు క్రీడలు, వ్యాయామం, సైక్లింగ్ వంటి కొన్ని పనుల వల్ల కూడా చిరిగిపోతుంది. 
 

అపోహ 3 - హైమెన్ చిరగడం అంటే కన్యత్వాన్ని కోల్పోవడమే!

వాస్తవం - కన్యత్వాన్ని కొలిచే సాధనం లేదు. హైమెన్ లేకపోతే మీరు కన్య కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కన్నెపొర వ్యాయామం చేయడం లేదా టాంపోన్లను ఉపయోగించడం వంటి అనేక శారీరక కార్యకలాపాల వల్ల చిరిగిపోతుంది. 

అపోహ 4: బిగుతైన యోని కన్యత్వానికి సంకేతం!

వాస్తవం - యోని బిగుతుగా ఉంటే మీరు సెక్స్ లో పాల్గొనలేదు అని కానే కాదు. కానీ చాలా మంది సెక్స్ లో పాల్గొంటే యోని వదులుగా మారుతుందని అనుకుంటారు. నిజమేంటంటే.. వయసు పెరిగే కొద్దీ యోని తన స్థితిస్థాపకతను కోల్పోతుంది. అందుకే ఈ ఊహ తప్పు. కాబట్టి శృంగారంలో పాల్గొంటే యోని సడలుతుందని అనుకోవడం పొరపాటే.
 

అపోహ 5 - భావప్రాప్తి పురుషులకు మాత్రమే

వాస్తవం: శృంగారంలో పురుషులకు మాత్రమే భావప్రాప్తి అవసరమని నమ్ముతారు. మహిళల భావప్రాప్తి గురించి ఎవరూ మాట్లాడరు. శృంగారంలో ఉద్వేగం పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం.

అపోహ 6: మహిళల భావప్రాప్తి అది అవసరం 

వాస్తవం: పురుషులకు పురుషాంగం నుంచి ఉద్వేగం ఉంటుందని, మహిళలకు యోని నుంచి ఉద్వేగం ఉంటుందని ఒక సాధారణ నమ్మకం. ప్రతి స్త్రీకి యోని నుంచి ఉద్వేగం ఉండదు. వాస్తవం ఏమిటంటే మహిళలు క్లైటోరల్, యోని, కలయిక ఉద్వేగం వంటి ఎన్నో విధాలుగా భావప్రాప్తిని పొందుతారు.

అపోహ 8 – వీర్యం విడుదల కాకపోతే స్త్రీలకు భావప్రాప్తి లభించదు

వాస్తవం - కొంతమంది పురుషులు కండోమ్స్ ను వాడకూడదని ఇలాంటి వాదనలు చేస్తుంటారు. ఇది ఏ మహిళ ఆరోగ్యానికైనా హానికరం. ఎందుకంటే ఇది అవాంఛిత గర్భధారణ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడేస్తుంది. ఇతర గర్భనిరోధకాలను ఉపయోగిస్తున్నప్పటికీ యోని లోపల స్పెర్మ్ ను విడుదల చేయడం అంటు కారకం. వీర్యం పీహెచ్ ఆల్కలీన్, యోని పీహెచ్ ఆమ్లంగా ఉంటుంది. స్పెర్మ్ యోనిలోకి వెళ్లడం వల్ల సంక్రమణ  ప్రమాదం పెరుగుతుంది. 

click me!