Health Tips: గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

Published : Jul 04, 2023, 11:25 AM IST

Health Tips: ఈ అధునాతన కాలంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ మొదలైనవి ముందు వరుసలో ఉంటాయి. వంటింటి వస్తువులతో గ్యాస్ ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.  

PREV
16
Health Tips: గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

నేటి కాలం టెన్షన్స్ కి పుట్టిల్లు ఎందుకంటే ప్రతిదీ ఇన్స్టెంట్గా అయిపోవాలి అది చదివైనా ఉద్యోగమైనా డబ్బు సంపాదన అయినా ఏదైనా చాలా ఫాస్ట్ గా అయిపోవాలి. అందుకోసం తెగ తాపత్రయ పడుతున్నారు నేటి తరం వారు అందుకోసం వారి ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెడుతున్నారు.
 

26

సరైన తిండి లేక, సమయానికి నిద్రలేక.. తగినంత వ్యాయామం లేక ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఈ అశ్రద్ధ వలన ముందుగా మనకి వచ్చే సమస్య కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్. ఇది రావటానికి ప్రధాన కారణం సరైన సమయానికి తిండి తినకపోవడం, జంక్ ఫుడ్ తినటం.

36

తిండి అరగడానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం మొదలైన వాటి వల్ల ఈ సమస్య తలెత్తుతుంది అయితే ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడు వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఎలా గ్యాస్ తగ్గించుకోవచ్చో చూద్దాం. మీకు యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉంటే సోపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది అపాన వాయువుని తొలగించడంలో సహాయం పడుతుంది.

46

ఆ జీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి సోపు ఉపయోగపడుతుంది భోజనం తర్వాత సోపు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జీలకర్ర కూడా జీర్ణానికి చాలా మంచిది అన్నవాహికలో అడ్డంకులు ఉంటే ఈ జీలకర్ర తినటం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు.

56

జీలకర్ర ఆహార వైపుని క్లియర్ చేయటంలో సహాయపడుతుంది తద్వారా జీర్ణవ్యవస్థ గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. మధ్యాహ్నం పూట మజ్జిగలో జీలకర్ర కలుపుకొని తాగితే ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. అలాగే యాలకులు కూడా కడుపు సంబంధిత సమస్యలకి దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు.

66

యాలకులు గ్యాస్ ని మాత్రమే కాకుండా తిమ్మిరి వికారం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనికి తోడు సరియైన వ్యాయామం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు పాటించండి. బాధ భరించలేనిదిగా మారినప్పుడు డాక్టర్ని సంప్రదించడమే మంచిది.

click me!

Recommended Stories