పురుషుల్లో తగ్గిపోతున్న సామర్థ్యం.. కారణం ఇదేనట..!

First Published Mar 20, 2021, 9:24 AM IST

 ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయని వారు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉన్నారు. సహజంగా పిల్లలు కలగకపోవడంతో ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ పరుగులు తీస్తున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటోందని.. అందుకే ఈ సమస్య ఏర్పుడుతోందని పరీక్షల్లో తేలుతోంది.
undefined
కాగా.. తాజాగా ఇదే విషయంపై ఓ సంస్థ పరిశోధనలు చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయని వారు చెబుతున్నారు.
undefined
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
undefined
కౌంట్‌డౌన్‌ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్‌ జీరోకు చేరవచ్చని చెప్పారు.
undefined
ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్‌ర్యాపింగ్స్‌ మొదలు, ప్లాస్టిక్‌ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్‌ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు.
undefined
వీటిలో పీఎఫ్‌ఏఎస్‌గా పిలిచే ఫరెవర్‌ కెమికల్స్‌ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్‌ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు.
undefined
ఈ రకం కెమికల్స్ పై పలు దేశాల్లో నిషేధం విధించారని.. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
పూర్వం మహిళలతో పోలిస్తే... ప్రస్తుత మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయని వారు చెబుతున్నారు. ఈ తరం మహిళలు 35 దాటిన తర్వాత గర్భం దాల్చడం చాలా కష్టమైందన్నారు. ఇక పురుషులు సైతం తమ తాతలతో పోలిస్తే.. వీర్య కణాల సంఖ్య సగానికి తగ్గిపోయిందని చెబుతున్నారు.
undefined
click me!