బరువును తగ్గించే సాబుదానా కిచిడీ !?

First Published | Mar 17, 2021, 11:57 AM IST

ఆకలి వేయగానే చిటికెలో తయారు చేసుకుని తినగలిగే ఫుడ్ కిచిడీ. ఇందులో అనేక రకాలుంటాయి. పప్పుతో చేసే కిచిడీ, అటుకుల కిచిడీ, సాబుదానా కిచిడీ అంటూ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. ఇది తొందరగా అయిపోవడమే కాకుండా హెల్త్ కూ ఎందో మంచింది. డైటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. 

ఆకలి వేయగానే చిటికెలో తయారు చేసుకుని తినగలిగే ఫుడ్ కిచిడీ. ఇందులో అనేక రకాలుంటాయి. పప్పుతో చేసే కిచిడీ, అటుకుల కిచిడీ, సాబుదానా కిచిడీ అంటూ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. ఇది తొందరగా అయిపోవడమే కాకుండా హెల్త్ కూ ఎందో మంచింది. డైటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమై పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. బజ్రా ఖిచ్డి, సబుదానా ఖిచ్డి, తూర్ దాల్ ఖిచ్డి అని రకరకాల కిచిడీలు వివిధ ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు. వీటన్నింటికీ ప్రత్యేకమైన తయారీ విధానం, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే తూర్ దాల్ కిచిడీ, సబుదానా ఖిచిడీల్లో ఏది మీకు డైట్ ప్లాన్ లో ఉపయోగపడుతుందో చూడండి.
సాబుదానా దీన్నే చాలా ప్రాంతాల్లో సాగో అని కూడా అంటారు. ఈ సాగోతో చేసిన వంటకం లేకుండా ఉపవాసం పూర్తికాదు. సాబుదానా కిచిడీ లేదా, ఖీర్ ఉపవాసవిరమణలో తప్పనిసరిగా ఉంటుంది. ట్రొపికల్ పామ్ ట్రీ వేళ్లతో తయారయ్యే ఆరోగ్యకరమైన పదార్థం ఇది. దీంట్లో తక్కువ మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
అంతేకాదు సాబుదాన లో కార్బోహైడ్రేట్లు, కేలరీల కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాబుదానాలోని సంక్లిష్టమైన పిండి పదార్థాలు, అనేక గ్లూకోజ్ అణువులు కలిగి ఉంటాయి, దీనిద్వారా శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. దీంట్లోని జిగట స్వభావం పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉంటుంది.
ఇన్ని ప్రయోజనాలున్న సాబుదానా బరువు తగ్గించడానికి అంత మంచి ఎంపిక కాకపోవచ్చు. కారణం దీంట్లోని ఎక్కువ మొత్తంలో ఉండే పిండిపదార్థాలే. కానీ అధిక కేలరీల కంటెంట్ డైటింగ్ లో దీన్ని చేర్చేలా ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కిలోల కొద్దీ బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఛాయిస్ గా ఉంటుంది.
100 గ్రాముల సబుదానాలో 332 కేలరీలు ఉన్నాయి, బ్రేక్ ఫాస్ట్ లో మీరు తీసుకునే క్యాలరీల కంటే ఇది ఎక్కువే. అంతే కాకుండా ఇందులో తక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే సాబుదానా ఖిచ్డికి చాలా కూరగాయలు, వేరుశెనగలను చేర్చవచ్చు.
అయితే సాగోను తినడం వల్ల ఇతర ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఫ్రీ మాలిక్యూల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

Latest Videos

click me!