వర్షాకాలంలో మైగ్రేన్ పెరుగుతుంది.. తగ్గాలంటే ఇలా చేయండి

Published : Jul 24, 2023, 03:45 PM IST

వర్షాకాలంలో మైగ్రేన్ నొప్పి ఎక్కువవుతుంది. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ నొప్పి పెరగకుండా జాగ్రత్తపడొచ్చు.  

PREV
17
వర్షాకాలంలో మైగ్రేన్ పెరుగుతుంది.. తగ్గాలంటే ఇలా చేయండి
migraine

మైగ్రేన్ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి జీవన నాణ్యత, రోజువారీ పనితీరుపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఇది నొప్పి, వికారం,  కాంతిని చూడకపోవడం, శబ్దాలను వినకపోవడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. వర్షాకాలంలో వివిధ కారకాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. 

27
Migraine

వర్షాకాలంలో మైగ్రేన్లు ఎందుకు వస్తాయి?

వర్షాకాలంలో వాతావరణ పీడనంలో మార్పులు, తేమ, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు వంటి అనేక అంశాలు మైగ్రేన్లను మరింత ఎక్కువ చేస్తాయి. వీటిని సాధారణంగా 'మాన్సూన్ మైగ్రేన్లు' అని పిలుస్తారు. మరి వర్షాకాలంలో మైగ్రేన్లను తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

హైడ్రేట్ గా ఉండండి

వర్షాకాలం మొత్తం తేమగా ఉంటుంది. అలాగే ఈ సీజన్ లో నిర్జలీకరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా మైగ్రేన్ కు కారణమవుతుంది. అందుకే ఈ సీజన్ లో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా నీటిని పుష్కలంగా తాగండి. అలాగే కెఫిన్, ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఇవి నిర్జలీకరణానికి దారితీస్తాయి. 
 

47

ఇండోర్ వాతావరణాన్ని నియంత్రించండి

తేమ స్థాయిలను నియంత్రించడానికి, బూజు, శిలీంధ్రాల పెరుగుదలను తగ్గించడానికి డీహ్యుమిడిఫైయర్లు లేదా ఎయిర్ కండిషనర్లను ఉపయోగించండి. అలెర్జీ కారకాలకు గురికావడాన్ని తగ్గించడానికి బాత్ రూం లు, వంటగది వంటి రూం లల్లో బూజు పెరుగుదలకు గురయ్యే ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి. 
 

57

స్థిరమైన దినచర్య

మీరు సమతుల్య భోజనం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. టైం టూ టైం పనులను చేస్తే మైగ్రేన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వర్షాకాలంలో ఒత్తిడి,  జీవనశైలి మార్పుల వల్ల ప్రేరేపించబడిన మైగ్రేన్ల సంభావ్యతను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

67

ట్రిగ్గర్లను గుర్తించండి

వర్షాకాలంలో మైగ్రేన్ కారణమయ్యే వాటిని గుర్తించండి. ఈ ట్రిగ్గర్లకు గురికాకుండా ఉండటానికి అవసరమైనవి చేయండి. మైగ్రేన్ నొప్పిని కలిగించే వాసనలు, కొన్ని ఆహారాలు లేదా నిర్దిష్ట వాతావరణ పరిస్థితులను నివారించండి. 

77
migraine

విశ్రాంతి 

ఒత్తిడిని తగ్గించడానికి, మీ మొత్తం ఆరోగ్యంగా మెరుగ్గా ఉండటానికి విశ్రాంతిని ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా, ఇతర సడలింపు పద్ధతులను ఫాలో అవ్వండి. ఇవి మైగ్రేన్ లక్షణాలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.

click me!

Recommended Stories