ప్రయాణాలు చేస్తున్నారా.. అయితే ఆహారంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

First Published Oct 3, 2021, 12:31 PM IST

ప్రయాణాలు చేయడంలో కొంతమంది సౌకర్యంగా మరికొంతమంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇక రెండు రకాలుగా ఫీలయ్యే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణాన్ని మర్చిపోవడానికి కొన్ని పనులు చేస్తుంటారు. 

ప్రయాణాలు చేయడంలో కొంతమంది సౌకర్యంగా మరికొంతమంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇక రెండు రకాలుగా ఫీలయ్యే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణాన్ని మర్చిపోవడానికి కొన్ని పనులు చేస్తుంటారు. అందులో కొందరు పేపర్ చదవడం ఇష్టపడితే మరి కొందరు మ్యూజిక్ వినడం ఇష్టపడతారు. ఇక కొందరు ఏదైనా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ అలా ఏదిపడితే అది కాకుండా మంచి ఫుడ్డుని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దానికి  ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం..
 

చాలా వరకు దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారు. అందులో ఎక్కువగా ఆయిల్ ఫుడ్డు మాత్రమే కనిపిస్తుంది.  కాబట్టి వాటిని ప్రయాణంలో తీసుకోవడం వల్ల కడుపులో వికారంగా ఉంటుంది. అందుకో ఆయిల్ ఫుడ్ బదులు డ్రై ఫ్రూట్స్ వంటి సహజ ఆహార పదార్థాలను తినాలి.
 

 కొందరు ప్రయాణం మధ్యలో కొనుక్కొని తినడానికి ఇష్టపడుతుంటారు. అలా అక్కడ చాలా జంకు ఫుడ్ లాంటివి మాత్రమే కనబడుతుంటాయి. కాబట్టి వాటిని కాకుండా స్వీట్ కార్న్ వంటివి లేదా మంచి పండ్లను తీసుకోవడం మంచిది. వేయించిన పదార్థాలకి దూరంగా ఉండాలి.
 

 ప్రయాణం ఎక్కువ దూరం ఉన్న సందర్భాల్లో చాలా వరకు ప్రయాణంలో భోజనం చేసే సమయం కూడా వస్తుంది. కాబట్టి ఇంటి నుంచి తయారు చేసుకున్న నూనె లేని రొట్టెలను తీసుకోవడం చాలా మంచిది. కొన్ని నూనె లేని ఉడకబెట్టిన గింజలను తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నం వంటివి పదార్థాలు ఇంటి నుండి తీసుకోకుండా రావడం మంచిది.
 

ఇక కొన్ని మార్గమధ్యంలో మంచి మంచి పండ్లరసాలను, సలాడ్లను వంటివి అమ్ముతుంటారు. వాటిని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జర్నీ లో ఎటువంటి వికారమైన ఫీలింగ్స్ రావు. ఇక పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా ముక్కల రూపంలో కూడా తీసుకుంటే లాభం ఉంటుంది.
 

ప్రయాణంలో పదేపదే తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా పుస్తకాన్ని చదవడం లేదా మ్యూజిక్ వంటివి వినడం వల్ల ఆకలిని కంట్రోల్ చేయవచ్చు. పక్కనున్న వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించాలి.
 

 ఇక ప్రయాణం తర్వాత అదే పనిగా కూర్చోకూడదు. చాలా వరకు కాలినడకన వెళ్లడానికి ప్రయత్నించాలి. దాని వల్ల మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణం తర్వాత ఎటువంటి హెవీ ఫుడ్డు తీసుకోకుండా ఉండాలి.

click me!