ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్‌తో ఇలా చేస్తే చాలు.. పొడి చర్మం సమస్యలు మాయం!

Navya G   | Asianet News
Published : Jan 13, 2022, 12:37 PM IST

వాతావరణంలో మార్పుల కారణంగా చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు, ముడుతలు వంటి సమస్యలు ఏర్పడి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు (Symptoms of aging) కనిపిస్తాయి. ఈ సమస్యను తగ్గించడానికి ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్ (Fruit Facial Creams) మంచి ఫలితాలను ఇస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి వాటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
18
ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్‌తో ఇలా చేస్తే చాలు.. పొడి చర్మం సమస్యలు మాయం!

ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేసుకునే ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్ మంచి బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) గా సహాయపడతాయి. ఈ ఫేషియల్ క్రీమ్స్ ను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్ చర్మానికి తగినంత తేమను అందించి పొడిబారకుండా చూస్తాయి.
 

28

ఇవి చర్మకణాలలోని మృతకణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తాయి. చర్మానికి మంచి నిగారింపును అందించడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని (Skin health) కూడా పెంచుతాయి. కనుక ఇంట్లోనే తయారు చేసుకునే ఈ  ఫ్రూట్ ఫేషియల్ క్రీమ్స్ లను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

38

బొప్పాయి, కలబంద గుజ్జు: ఒక గిన్నెలో ఒక కప్పు బొప్పాయి గుజ్జు (Papaya pulp), రెండు  విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఆయిల్ (Vitamin E capsules Oil), ఒక స్పూన్ తేనె (Honey), రెండు స్పూన్ ల కలబంద గుజ్జు (Aloevera pulp) వేసి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
 

48

ఈ క్రీమ్ ను ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని మృదువుగా మర్దన (Massage) చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం (Clean) చేసుకుంటే చర్మం తాజాగా మృదువుగా మారుతుంది.
 

58

నారింజ, కలబంద గుజ్జు: ఒక కప్పులో రెండు స్పూన్ ల నారింజ జ్యూస్ (Orange juice), ఒక  స్పూన్ గ్లిజరిన్ (Glycerin), ఒక స్పూన్ ఆలివ్ నూనె (Olive oil), రెండు స్పూన్ ల కలబంద గుజ్జు (Aloevera pulp) వేసి కలుపుకోవాలి.  ఇలా తయారుచేసుకున్న క్రీంను ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెడితే 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. 
 

68

ఈ క్రీమ్ ను రాత్రి పడుకునే ముందు ముఖం, చేతులకు పట్టించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రీమ్ చర్మానికి మంచి యాంటీ ఏజెంట్గా (Anti-agent) సహాయపడి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది (Makes skin tight).
 

78

పుచ్చకాయ, బాదం నూనె: ఒక కప్పులో రెండు స్పూన్ ల పుచ్చకాయ రసం (Watermelon juice), రెండు స్పూన్ ల గ్లిజరిన్ (Glycerin), ఒక స్పూన్ బాదం నూనె (Almond oil), రెండు విటమిన్ ఇ క్యాప్సిల్స్ (Vitamin E capsules) వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్రీం మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
 

88

ఈ క్రీమ్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.  అర గంట తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ క్రీం ముఖంపై మచ్చలు (Spots), మొటిమలను (Pimples) తగ్గించి ముఖానికి మంచి నిగారింపును అందిస్తుంది.

click me!

Recommended Stories