వ్యాయామానికి ముందు, ఆతర్వాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

Navya G   | Asianet News
Published : Jan 07, 2022, 12:57 PM IST

మన జీవన శైలిలో వ్యాయామం (Exercise) అనేది శరీరానికి శారీరకశ్రమను అందించే ఒక ఆరోగ్యమైన ప్రక్రియ (Healthy process). క్రమం తప్పక చేసే వ్యాయామాలతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతారు. వ్యాయామానికి సరైన ఆహార పదార్థాలను జోడిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
వ్యాయామానికి ముందు, ఆతర్వాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

వ్యాయామం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది. వ్యాయామానికి ముందు, తర్వాత తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరానికి మరింత దృఢత్వం అందుతుంది. ఒత్తిడి (Stress), మానసిక ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా (Calm down) ఉంటుంది. మనిషి ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో తీసుకొనే ఆహార పదార్థాల్లో కూడా అంతే జాగ్రత్త తప్పనిసరి.
 

26

శరీరానికి వ్యాయామాన్ని, ఆహారాన్ని సమపాళ్లలో  అందిస్తే సత్ఫలితాలు పొందగలుగుతాం. దీంతో మనిషి జీవితకాలం పెరుగుతుంది. వ్యాయామానికి ముందు పిండి పదార్థాలు (Carbohydrates) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను  తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పెరుగు, అరటిపండు, ఎండు ఫలాలను తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలు (Insulin levels) సమతుల్యం అవుతాయి.
 

36

అలాగే యాపిల్, బాదం, పాలు, వాల్ నట్స్, ఓట్స్, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. వీటితో పాటు తేనె కలిపిన నిమ్మ నీళ్లు, అవిసె గింజలు (Flax seeds), చియా సీడ్స్ (Chia seeds) వంటివి తీసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వస్తుంది. కనుక వ్యాయామం పూర్తయిన తరువాత నీళ్లు తాగడం  మంచిది.
 

46

నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలోకి వస్తుంది. ఇలా చేస్తే శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారినపడకుండా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది. కనుక శరీరానికి కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వాలి. దీంతో శరీరంపై ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది. వ్యాయామం తరువాత హై ప్రోటీన్ (High protein) కలిగిన పదార్థాలను తీసుకోవాలి.
 

56

వర్కవుట్లు పూర్తయిన తర్వాత శరీరానికి శక్తి అవసరం అవుతుంది. కనుక గుడ్లు (Eggs) తింటే శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందడంతో పాటు కండరాల సామర్థ్యానికి సరిపడు పోషకాలు అందుతాయి. వ్యాయామం తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోకుండా ఉండేందుకు చిలగడదుంపను (Sweet potato) తీసుకోవడం మంచిది. వీటితో పాటు పండ్లు చిరుధాన్యాలు పీనట్ బటర్ టోస్ట్, ఆమ్లెట్, కాటేజ్ చీజ్ వంటి వాటిని తీసుకోవాలి.   
 

66

ఎండు ఫలాలు వేసిన పాలు, పెరుగుతో పాటు పీచు (Fiber), ప్రొటీన్లు (Proteins), పిండిపదార్థాలు మెండుగా ఉండే బాదం, కిస్మిస్ గింజలను గుప్పెడు తీసుకోవాలి. ఇన్సులిన్ బ్యాలెన్స్ చేయడానికి, మజీల్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి చేపలను తీసుకోవడం మంచిది. ట్యూనా రకం చేపలలో అధిక మొత్తంలో ప్రొటీన్లు పోషకాలు  ఉంటాయి. కనుక ఈ రకం చేపలను తీసుకోవడం మంచిది.

click me!

Recommended Stories