చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ 9 రకాల ఆహారం తినాల్సిందే!

Navya G   | Asianet News
Published : Jan 06, 2022, 05:40 PM IST

చలికాలంలో (Winter) ముఖ్యంగా పిల్లలకు ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నుంచి వారిని కాపాడుకోవడానికి వారు తీసుకునే ఆహార జీవనశైలిలో ప్రత్యేక శ్రద్ద తప్పనిసరి. అయితే వారిలో వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచేందుకు ఏ పదార్థాలను తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..  

PREV
18
చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ 9 రకాల ఆహారం తినాల్సిందే!

పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి వారికి సరైన పోషకాలు (Nutrients) కలిగిన ఆహార పదార్థాలను అందించడం తల్లుల బాధ్యత. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే వారిలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా (Healthy) ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
 

28

ఖర్జూరం: ఖర్జూరంలో (Dates) ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని రోజు పిల్లలు తీసుకుంటే పిల్లలకు వెచ్చదనాన్ని అందించి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
 

38

దానిమ్మ: దానిమ్మలో (Pomegranate) యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలలో రక్తహీనత సమస్యలను (Anemia) తగ్గించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దానిమ్మ రసాన్ని తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
 

48

గుడ్డు: గుడ్డులో (Egg) ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు (Child growth) సహాయపడతాయి. చలికాలంలో రోజు పిల్లలకు గుడ్లు ఇవ్వడం మంచిది. ఫలితంగా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గుడ్లు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. 
 

58

చిలగడదుంప: చిలకడదుంపలో (Sweet potato) ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. పిల్లలను ఇన్ఫెక్షన్ల (Infection) నుంచి దూరంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉడికించిన చిలగడ దుంపలను పిల్లలకు ఇవ్వడం మంచిది.
 

68

ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు: తాజా ఆకుపచ్చ కూరగాయలు (Green vegetables), పండ్లలో (Fruits) విటమిన్లు, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. చలికాలంలో వీటిని పిల్లలకు అందిస్తే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 

78

వెల్లుల్లి: వెల్లుల్లిలో (Garlic) యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు (Medicinal properties) ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను తగ్గించి వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక పిల్లలకు అందించే ఆహార పదార్థాలలో తగినంత వెల్లుల్లిని ఉపయోగించడం తప్పనిసరి.
 

88

ఉసిరి: ఉసిరి (Amla) అద్భుతమైన ఔషధం గని. ఉసిరిని తీసుకుంటే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. ఇది శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లలలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యను తగ్గించి ఆరోగ్యంగా (Health) ఉండేందుకు సహాయపడుతాయి.

click me!

Recommended Stories