ఈ ఫుడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి తెలుసా?

Published : Jul 15, 2023, 03:45 PM IST

పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారడంతో పాటు శరీరంలోని వ్యాధులతో పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గుండె బలంగా ఉంటుంది. గుండె జబ్బు ముప్పు కూడా తగ్గుతుంది.   

PREV
18
ఈ ఫుడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి తెలుసా?

మనం తినే చిన్న చిన్న పొరపాట్లే మన గుండెను దెబ్బతీస్తాయి. అందుకే ప్రస్తుతం కాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, హైపర్ టెన్షన్ రిస్క్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే పౌష్టికాహారాన్ని తీసుకుంటే మన శరీరం దృఢంగా మారడంతో పాటుగా శరీరంలోని వ్యాధులతో పోరాడే శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొన్ని పోషకాహారాలు కూడా మన గుండెను రక్షిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

28

హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి మన రోజువారి ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, చేపలు, కూరగాయల నూనెలను చేర్చాలి.  పరిశోధనల ప్రకారం.. ఈ డైట్ ప్లాన్ ను అనుసరించే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 31 శాతం, డయాబెటిస్ రిస్క్ 33 శాతం, స్ట్రోక్ రిస్క్ 20 శాతం తక్కువగా ఉంటుంది.

38

heart

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ఒక పరిశోధన ప్రకారం.. మొక్కల ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. నిజానికి సంతృప్త కొవ్వుల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారంలో ఎక్కువ పోషకాలు అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48
Image: Getty Images

వాల్ నట్స్ 

రోజుకు గుప్పెడు వాల్ నట్స్ ను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీంతో ధమనులు హెల్తీగా ఉంటాయి. ధమనుల్లో కొవ్వు తగ్గుతుంది. వాల్ నట్స్ లో ఫైబర్, ఒమేగా 3, ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటి సాయంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.వాల్ నట్స్ ను నానబెట్టి తినొచ్చు. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

58

నారింజ 

విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లలో పొటాషియం కొలెస్ట్రాల్-ఫైటింగ్ ఫైబర్ పెక్టిన్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటు స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాలు పెరగడమే కాకుండా అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుంది. 

68

అవిసె గింజలు 

యాంటీ ఆక్సిడెంట్ పష్కలంగా ఉండే అవిసె గింజలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తింటే శరీరంలో రక్త ప్రవాహం నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా ఉంటుంది. 1 నుంచి 2 టీస్పూన్ల కాల్చిన అవిసె గింజలను తిన్న తర్వాత మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఈ సూపర్ ఫుడ్ ను పెరుగు, ఓట్స్ తో కలిపి తినొచ్చు.
 

78
curd

తక్కువ కొవ్వు పెరుగు

తక్కువ కొవ్వు ఉన్న పెరుగు గుండె ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ ను అందిస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ రేట్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

88

ముదురు ఆకుపచ్చ కూరగాయలు

విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ముదురు ఆకుపచ్చ కూరగాయలలో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం గుండెకు సులభంగా చేరుతుంది. ఇందుకోసం పాలకూర, బచ్చలికూర, ఆవాలు, మెంతులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిని భోజనంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఐరన్, ఫైబర్ లోపం కూడా తీరుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories