
మల్బరీ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. నిజానికి మల్బరీ పండ్లు విటమిన్లు, పోషకాల బాంఢాగారం. ఈ పండ్లు ఎరుపు, నలుపు, ఊదా, గులాబీ, తెలుపు వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. తీయని, కొద్దిగా పల్లని రుచిని కలిగున్న ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అసలు ఈ పండును రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
mulberry
గుండె ఆరోగ్యం
మల్బరీ పండ్లు మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మల్బరీ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే గుండెను పదిలంగా ఉంచుతుంది.
జీర్ణక్రియ
మన రోజువారి ఆహారంలో మల్బరీ పండ్లను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మల్బరీలో ఉండే ఫైబర్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ పండ్లు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
రక్తహీనత
మల్బరీ పండ్లను తినడం వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఏర్పాటును పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండ్లు మన శరీరంలో రక్తాన్ని పెంచుతాయి.
కంటి ఆరోగ్యం
మల్బరీ పండ్లలో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లు మన కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మనకు ఎలాంటి రోగాలు రావు. ఒకవేళ వచ్చినా తొందరగా తగ్గిపోతాయి.అయితే మల్బరీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం
మల్బరీ పండ్లు మన ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మల్బరీ పండ్లలో ఉండే విటమిన్ సి, కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
డయాబెటీస్
డయాబెటిస్ ఉన్నవారికి మల్బరీ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీళ్లు ఈ పండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. క్రమం తప్పకుండా మల్బరీ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.
Mulberry
మెదడు ఆరోగ్యం
మల్బరీ పండ్లలో కాల్షియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఈ పండ్లు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి.
Mulberry
జుట్టు ఆరోగ్యం
మల్బరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
వెయిట్ లాస్
బరువు తగ్గాలనుకునే వారు కూడా మల్బరీ పండ్లను డైట్ లో చేర్చుకోవచ్చు. మల్బరీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే ఫైబర్స్ కడుపును నిండుగా ఉంచుతాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.