మనకు అందుబాటులో ఉండే పండ్లు,కూరగాయలతోనే బీపీని కంట్రోల్ చేయవచ్చట. బీపీని అదుపులో ఉంచుకోవడానికి బీట్‌రూట్‌ను తీసుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. బీట్‌రూట్‌లో పొటాషియం , నైట్రిక్ ఆక్సైడ్ ఉన్నాయి, ఇది వాసోడైలేషన్‌లో సహాయపడుతుంది. ఇది శరీరంలోని రక్తనాళాలను విస్తృతం చేస్తుంది, దీని ద్వారా రక్తం సులభంగా ప్రవహిస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.