
మూత్రం ద్వారా మన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిజానికి మూత్రం మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపాల్సి వస్తుంది. కానీ ఇలా మూత్రాన్ని తరచుగా ఆపడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. కానీ అతి చురుకైన అంటే తరచుగా మూత్రం వచ్చేవారు వారి కెగెల్ కండరాలను బలోపేతం చేయడానికి మూత్రాన్ని కొద్దిసేపు ఆపాలని సలహానిస్తారు. కానీ దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. నిజమేంటంటే.. మూత్రాన్ని ఆపడం అంత మంచిది కాదు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అవేంటంటే..
కమ్యూనికేషన్ వ్యవస్థను విస్మరించడం
మూత్రవిసర్జన సాధారణ ప్రక్రియ. ఇందులో మూత్రాశయంలోని నరాలు పాల్గొంటాయి. మూత్రాశయం సగం నిండినప్పుడు ఈ నరాలు మెదడుకు సంకేతాన్ని పంపుతాయి. మీరు మూత్ర విసర్జన చేయాలని. కానీ మీరు మూత్రవిసర్జన చేయనప్పుడు మీ శరీరం మ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే మూత్రవిసర్జన చేయాలనిపించినప్పుడు వెంటనే చేయండి.
అలాంటి సామర్థ్యం లేకపోవడం
కిడ్నీ అండ్ యూరాలజీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (కెయుఎఫ్ఎ) ప్రకార.. ఆరోగ్యకరమైన వయోజనుడు తన మూత్రాశయంలో రెండు కప్పుల మూత్రాన్ని నింపగలడు. మీరు ప్రెగ్నెంట్ కాకపోతే, డయాబెటిస్, యూటీఐ లేదా మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా వ్యాధితో బాధపడకపోతే.. మీరు మూత్రాన్ని నియంత్రించొచ్చు. కానీ రెండు కప్పుల కాఫీ, అర లీటరు నీరు లేదా ఒక పెద్ద గ్లాసు జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా? ఇలాంటి సమయంలో మీ మూత్రాశయం నిండుతుంది. ఇలాంటి సమయంలో కూడా మీరు మూత్రవిసర్జన చేయకపోతే అసౌకర్యం కలుగుతుంది.
యూటీఐ ప్రమాదం పెరుగుతుంది
సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్రాన్ని ఆపడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతుంటే అది మరింత దిగజారుతుంది. ఎందుకంటే మూత్ర విసర్జన ఆపేస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మూత్రనాళంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సంక్రమణ అవకాశాలను బాగా పెంచుతుంది.
మూత్ర నియంత్రణ ఆగిపోవచ్చు
హార్వర్డ్ మెడికల్ స్కూల్లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్ర విసర్జనను ఆపడం వల్ల మీ కటి కండరాలు బలహీనపడటం మొదలవుతుంది. దీనివల్ల క్రమంగా మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యం దెబ్బతిని యూరిన్ లీకేజీ సమస్య ఎక్కువవుతుంది. ఫలితంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు కూడా మూత్రం లీక్ అవుతుంది.
మూత్రపిండాలు ప్రమాదంలో ఉండొచ్చు
అన్నల్స్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మూత్రవిసర్జనను ఆపే అలవాటు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇంతకు ముందు ఇలాంటి సమస్య ఉన్నవారిలో. ఎందుకంటే మూత్రంలో కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. కొన్నిసార్లు మీరు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపినప్పుడు అది మూత్రపిండాలకు తిరిగొస్తుంది. ఇది మూత్రపిండాలకు అస్సలు మంచిది కాదు.
మీ మూత్రాశయం పగిలిపోవచ్చు
తరచుగా మూత్ర విసర్జనను ఆపడం వల్ల మీ మూత్రాశయం చీలిపోవడం, పగిలిపోవడం కూడా జరగొచ్చు. మీ మూత్రాశయం నిండినా మీరు మూత్ర విసర్జన చేయకపోతే ఖచ్చితంగా ఈ సమస్య వస్తుంది. దీనికి అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.