సోంపు ఎన్నో ఔషధ గుణాలను కలిగిన ఉన్న మసాలా దినుసు. సోంపు గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో స్థూల, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలీనియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.