ఈ మూడు పదార్థాలు చాలు జీర్ణ సమస్యలను దూరం చేయడానికి..!

Published : Mar 29, 2023, 07:15 AM IST

తిన్న వెంటనే గుండెల్లో మంట, కడుపులో మంట, కడుపు నొప్పి వంటివన్నీ కలగడం ఎసిడిటీ లక్షణాలు. దీనిని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే అల్సర్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.   

PREV
15
 ఈ మూడు పదార్థాలు చాలు జీర్ణ సమస్యలను దూరం చేయడానికి..!
acidity

ప్రస్తుత కాలంలో ఎసిడిటీ  సమస్యను దాదాపు ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్నారు. అసిడిటీ ప్రధాన లక్షణాలు భోజనం తిన్న వెంటనే గుండెల్లో మంట, ఉబ్బరం కలగడం. కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, అల్సర్లతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

25

ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం, జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, చెడు ఫుడ్ కాంబిననేషన్, చెడిపోయిన మాంసాన్ని తినడం, మసాలా, పుల్లని, కారంగా ఉండే ఆహారాలు, మానసిక ఒత్తిడి వంటివి ఎసిడిటీకి దారితీస్తాయి. ఎసిడిటీ సమస్య నుంచి బయటపడటానికి ముందుగా మీరు చేయాల్సింది వేళకు తినడం. అయితే కొన్ని రకాల ఆహారాలు ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

35
ginger general

అల్లం

అజీర్థి, వికారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు అల్లం ఒక సాంప్రదాయ నివారణ. అల్లంలో కార్మినేటివ్ ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో అదనపు వాయువును తగ్గించడానికి సహాయపడుతుంది. టీ లో వేసుకుని లేదా పచ్చి అల్లాన్ని కొద్దిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. 

45

సోంపు గింజలు

భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమలడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. అలాగే ఇది మంటను కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలు, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి తాగండి. అయితే  కొత్తిమీర ఆకులను సోంపు నీటిలో కూడా కలుపుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి ఈ నీటిని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.
 

55
Coriander water

ధనియాలు

ధనియాలు కడుపు నొప్పిని తగ్గించడానికి, ఇతర జీర్ణ సమస్యలకు దూరంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ధనియాలు మరిగించిన నీటిని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల వివిధ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

click me!

Recommended Stories