మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలోనే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి కారణం.. వాతావరణంలో వచ్చే పెద్ద మార్పు. ఈ మార్పు వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతోనే లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను తొందరగా తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ బాగా సహాయపడతాయి. వీటిని మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇంతకీ అవేంటంటే?