నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముల్లంగి యూరిక్ యాసిడ్‌కి మందు కాదు. కానీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి దోహదపడే కొన్ని లక్షణాలు దానిలో ఉన్నాయి. ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ప్యూరిన్ల పేరుకుపోవడాన్ని నిరోధించడానికి, ఆక్సలేట్ రాళ్లను తగ్గించడానికి, వాటిని తొలగించడానికి సహాయపడతాయి
ముల్లంగిలో ప్యూరిన్ స్థాయి చాలా తక్కువగా ఉండటం వల్ల, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు దీన్ని ఇష్టమొచ్చినట్లు తినవచ్చు. అంతేకాకుండా ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎముకలు, కండరాలు, కీళ్లలో వచ్చే నొప్పి, వాపును తగ్గించడానికి బాగా సాయపడతాయి. ముల్లంగిలో 90-95% నీరు ఉండటం వల్ల, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా మూత్ర ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా శరీరం నుంచు బయటకు వెళ్లిపోతుంది.