ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండే లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే తక్కువ బరువున్నా సమస్యే. చాలా మంది ఎక్కువ లేదా తక్కువ బరువు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఉండాల్సిన బరువు ఉంటారు. ఈ బరువు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రోగాలు రాకుండా చూస్తుంది.అయితే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా కష్టం. కానీ కొన్ని చిట్కాలతో మీరు బరువు పెరగకుండా, తగ్గకుండా ఉంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భోజన అలవాట్లు
చాలా మందికి రాత్రి 9, 10 గంటల తర్వాతే భోజనం చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు రాత్రి 7 గంటలకు భోజనం చేసేయాలి. అలాగే రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. దీనివల్ల మీరు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో మీ శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉండదు.
హైడ్రేటెడ్ గా ఉండండి
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం, ఆకలిని నియంత్రించడానికి నీటిని పుష్కలంగా తాగాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వయోజనులు రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగాలి.
ఉప్పు వాడకం
ఉప్పు ఎంత తక్కువ వాడితే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. మీరు మీ రోజువారి ఆహారంలో ఎంత తక్కువ ఉప్పును ఉపయోగిస్తే మీ శరీరం తక్కువ నీటిని నిలుపుకుంటుంది. నీరు మిమ్మల్ని బరువు పెరగకుండా కాపాడుతుంది.
చక్కెరకు దూరంగా ఉండండి
చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే షుగర్ లేనిపోని రోగాలొచ్చేలా చేస్తుంది. షుగర్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ తో పాటుగా మీరు ఊబకాయం బారిన పడేలా చేస్తుంది.
ఆల్కహాల్ మానుకోండి
ఆల్కహాల్ పానీయాలలో కూడా కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే బరువు పెరగొద్దంటే మీరు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడి కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒత్తిడి వల్ల అతిగా తినే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించండి.