ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లను వాడితే ఏమౌతుందో తెలుసా?

First Published | May 31, 2024, 12:36 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్లాస్టిక్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంటి నుంచి మార్కెట్, ఆఫీసు వరకు ప్రతిచోటా ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఎన్నో రసాయనాలతో తయారవుతుంది. దీనిని వాడితే లేనిపోని రోగాలు వస్తాయి. 

మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైపోయింది. ప్లాస్టిక్ సంచులు నుంచి ప్లాస్టిక్ ప్లేట్ల వరకు.. ఎన్నో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నాం. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. తాగే సీసాల నుంచి ఫుడ్ ప్యాకింగ్ బిన్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టికే దర్శనమిస్తోంది. కానీ ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా మంచిది కాదు. 
 

మీకు తెలుసా? ప్లాస్టిక్ మన శరీరానికి హాని చేసే ఎన్నో రసాయనాలతో తయారవుతుంది. ప్లాస్టిక్ లో ఏ ఆహార పదార్థాలను పెట్టినా అవి కలుషితం, విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అసలు ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



ప్లాస్టిక్ లో బీపీఏ (బిస్ఫెనాల్) అనే ఎన్నో ప్లాస్టిక్ ఉత్పత్తులలో కనిపించే రసాయనం ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. 

 ప్లాస్టిక్ లో థాలేట్స్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ను ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలకు.
 

ప్లాస్టిక్ టిఫిన్ లేదా బాటిళ్లలో వేడి వేడి ఆహారం లేదా నీటిని ఉంచడం వల్ల ఆహారంలో ప్లాస్టిక్ రసాయనాలు కలుస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అంతేకాకుండా ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల అది విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడి ఆహారం, నీటిలో చేరి మన శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 

ప్లాస్టిక్ టిఫిన్లను ఎక్కువ కాలం అసలే వాడకూడదు. ఎందుకంటే ఇది చాలా  త్వరగా అరిగిపోతాయి. అందుకే వీటిని చెత్తలో పడేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతే, అది వాతావరణంలో వ్యాప్తి చెందుతుంది. ఇది నీరు, గాలిలో కాలుష్యానికి కారణమవుతుంది. ఈ కాలుష్యం ఏదో విధంగా శరీరానికి చేరి ఆరోగ్యానికి అనేక సమస్యలకు కారణమవుతుంది. 

ప్లాస్టిక్ టిఫిన్లు, బాటిళ్లు కాలక్రమేణా ఆహారం, నీటిలో వింత రుచులు, వాసనలను కలిగిస్తాయి. ఇది మీ ఆహారాన్ని పాడు చేస్తుంది.
 

lunch box

ప్లాస్టిక్ ను ఎలా ఉపయోగించాలి

- ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులను వాడటానికి బదులుగా  స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్ బాక్స్ లను వాడాలి.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగకూడదు. వీలైనప్పుడు గ్లాసులో నీళ్లు తాగాలి.

- ఎల్లప్పుడూ మీతో ఒక కప్పు లేదా కంటైనర్ ఉంచండి. ఇందులో మీరు మీ ఆహారాన్ని పెట్టి తినండి. 

 ఇంటి నుంచి స్టీల్ లేదా రాగి సీసాలో మాత్రమే నీటిని తీసుకెళ్లండి. అలాగే మార్కెట్ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనకండి. 

Latest Videos

click me!