మెట్లు ఎక్కడం ఒత్తిడిని తగ్గించడంలో , మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.
ప్రతిరోజూ మెట్లు ఎక్కి దిగడం అలవాటు చేసుకుంటే అది మీ గుండెకు క్రమబద్ధమైన వ్యాయామంగా పరిగణించవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు, మెట్లు ఎక్కడం కొలెస్ట్రాల్ , బిపి సమస్యలతో పోరాడుతుంది. అందుకే.. ఒకటి, రెండు ఫ్లోర్లు వెళ్లాల్సి వస్తే.. లిఫ్ట్ కి బదులుగా మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోవాలి.