
పేలవమైన రక్త ప్రసరణ సమస్యను ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనికి స్థూలకాయం, ధూమపానం, డయాబెటిస్, రేనాడ్ వ్యాధి కారణాలు కావొచ్చు. రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం వల్ల నొప్పి, కండరాల తిమ్మిరి, జీర్ణ సమస్యలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చల్లదనం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువైతే మందులతో తగ్గించుకోవచ్చు. అయితే శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు జీవన శైలి కూడా సహాయపడతాయి.
సరైన ఆహారాన్ని తినడంతో పాటుగా కొన్ని జీవనశైలి మార్పులు కూడా రక్తప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. ధూమపానం మానేయడం, ఒత్తిడికి దూరంగా ఉండటం, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, ప్రతిరోజూ పుష్కలంగా నీటిని తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, మితంగా వ్యాయామం చేయడం వంటివి ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం
ఉల్లిపాయ, దానిమ్మ వంటి ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచడానికి మీ ధమనులు రక్త ప్రవాహాన్ని విస్తరించడం ద్వారా ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్త నాళాలను తెరచి మెరుగైన రక్త ప్రవాహానికి అవకాశం కల్పించే దానిమ్మ జ్యూస్ ను కూడా తాగొచ్చు. అంతేకాకుండా ఇవి ధమనులు మందంగా, దృఢంగా మారకుండా కాపాడుతుంది.
నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఆహారం
ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, దాల్చినచెక్క, బీట్రూట్, ఆకుకూరలు వంటి నైట్రిక్ ఆక్సైడ్ సరైన పరిమాణంలో ఉన్న ఆహారాలు కూడా ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కర్కుమిన్ ద్వారా పసుపు కూడా రక్త ప్రసరణకు సహాయపడుతుంది.
విటమిన్ సి
విటమిన్ సి నారింజ వంటి ఫ్లేవనాయిడ్ ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్ల ద్వారా లభిస్తుంది. ఇది రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మీ రక్త ప్రవాహాన్ని పెంచేటప్పుడు రక్తపోటు, ధమనులలో దృఢత్వాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు పుచ్చకాయ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గింజలు
బాదం, వాల్ నట్స్ వంటి గింజలు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఎల్-అర్జినిన్ నైట్రిక్ ఆమ్లం వాల్ నట్స్ లో ఉంటాయి. ఇవి రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
టమోటాలు, బెర్రీలు
టమోటాలు, బెర్రీలు యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ను నిరోధిస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. టమోటాల్లో ఉండే లైకోపీన్ గుండెజబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. టమోటాల్లో ఉండే విటమిన్ కె రక్తప్రసరణను మెరుగుపరుస్తూ రక్తస్రావం, రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ధమనులను విడదీస్తాయి. రక్త ప్రవాహాన్ని పెంచుతాయి.