హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను తీసుకెళుతుంది. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచుకోవాలి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..