
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయం ఒక ముఖ్యమైన అవయవం. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా చాలా అవసరం. గర్భాశయం ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి తరచుగా టెస్టులు చేయించుకోవాలి. అయితే స్వీయ-సంరక్షణ పద్ధతులను కూడా పాటించాలి. నిపుణుల ప్రకారం.. సమతుల్య, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం కూడా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆకు కూరలు
బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ వంటి ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మీ గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకుకూరలలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గర్భాశయ గోడలను నిర్మించి రక్త ప్రవాహాన్నిమెరుగ్గా ఉంచుతాయి. ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, గాయం నుంచి రక్షిస్తాయి.
తృణధాన్యాలు
బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యత, పేగు పనితీరును మెరుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. తృణధాన్యాలు పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ప్రోబయోటిక్స్
పెరుగు, కేఫీర్ వంటి ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాలు కడుపులోని మైక్రోబయోటాను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఇవి ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్ సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి ఫ్యాటీ ఫిష్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపలలో ఉండే ఈ మంచి కొవ్వులు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే శరీరంలో మంట వివిధ పునరుత్పత్తి వ్యాధులకు దారితీస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు హార్మోన్ల సంశ్లేషణ, నియంత్రణకు కూడా అవసరం. ఇది సాధారణ రుతు చక్రాలను నిర్వహించడానికి ఎంతో అవసరపడుతుంది.
గింజలు, విత్తనాలు
బాదం, వాల్ నట్స్, అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొంతమంది మహిళల్లో విటమిన్ ఇ పునరుత్పత్తి అవకాశాలను పెంచేటప్పుడు నెలసరి అసౌకర్యం, తిమ్మిరిని తగ్గిస్తుందని నిరూపించబడింది. అలాగే ఈ గింజలు, విత్తనాలలోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగించడానికి ఎంతో అవసరం.
పండ్లు
దానిమ్మ, నారింజ, బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పోషకాలు ఉంటాయి. దానిమ్మలో పాలీఫెనాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని తేలింది. నారింజ, ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గాయాలను తొందరగా మాన్పుతుంది.