మీ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే వీటిని తినండి

First Published May 27, 2023, 4:30 PM IST

విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను, బ్రోకలీ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు రోగాల ముప్పు తప్పుతుంది. ఇందుకోసం వేటిని తినాలంటే? 
 

Immunity

సిట్రస్ పండ్లు

చాలా మంది జలుబు చేసిన వెంటనే విటమిన్ సి ని తీసుకుంటారు. ఎందుకంటే ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంటువ్యాధులతో పోరాడటానికి అవసరమైన తెల్ల రక్త కణాలు విటమిన్ సి ఉన్నప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాదాపు అన్ని రకాల సిట్రస్ పండ్లలో విటమిన్ సి స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. 
 

అల్లం

చాలా మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపయోగించే మరొక ఆహార పదార్థం అల్లం. అల్లం చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది తాపజనక రుగ్మతలు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అల్లం వికారాన్ని కూడా తగ్గిస్తుంది. అల్లంలో జింజెరోల్ ఉంటుంది. ఇది క్యాప్సైసిన్ కు  సంబంధించిన సమ్మేళనం. ఇది శరీరానికి వేడిని ఇస్తుంది. అంతేకాదు అల్లం దీర్ఘకాలిక అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. అల్లంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలను కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

Image: Getty

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీ మీరు తినగలిగే ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాని మీ బలాన్ని పెంచుతుంది. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఆహారంలో ఎక్కువ పోషకాలను సంరక్షించడానికి దీన్ని ఆవిరి చేసి తినడం మంచిది. 
 

Image: Getty

 వెల్లుల్లి

భారతదేశంలో దాదాపు ప్రతి వంటకంలో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ రుచిని పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అంటువ్యాధులను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అల్లిసిన్ వంటి వెల్లుల్లిలో సల్ఫర్ కలిగిన రసాయనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Image: Getty

రెడ్ బెల్ పెప్పర్ 

రెడ్ బెల్ పెప్పర్స్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా దదీనిలో విటమిన్ సి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ శరీరం బీటా కెరోటిన్ ను విటమిన్ ఎగా మారుస్తుంది. ఇది మీ చర్మం, కళ్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

click me!