కౌగిలింతతో బోలెడు లాభాలు.. ఈ ప్రేమ భాష ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా?

First Published | Sep 11, 2023, 10:41 AM IST

వెచ్చని కౌగిలి ఇష్టమైన వారి పట్ల మీకున్న ప్రేమను తెలుపుతుంది. ఇది ఇద్దరి వ్యక్తులను మరింత దగ్గర చేయడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కౌగిలి మాటల్లో చెప్పలేని మధురమైన భావాన్ని కలిగిస్తుంది. ఇరు మనసుల్లో ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు హగ్ ఇద్దరి ఒత్తిడి, యాంగ్జైటీనీ దూరం చేస్తుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చాలా మంది తమ భాగస్వాములను తరచుగా కౌగిలించుకుంటారు. అయితే ఈ కౌగిలింత కూడా భాగస్వాములతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా సహాయపడుతుంది. ఈ సంగతి పక్కన పెడితే కౌగిలింతతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే.. 
 

ఒత్తిడిని తగ్గిస్తుంది

వెబ్ఎండీ ప్రకారం.. మీకు ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే  హార్మోన్ విడుదల అవుతుంది. ఇది సంతోషకరమైన హార్మోన్. ఇది మీకు ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ అనే హార్మోన్ ను తగ్గిస్తుంది. దీంతో మీ ఒత్తిడి కొద్దిసేపట్లోనే తగ్గిపోతుంది. అంతేకాదు ఇది మీ అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 
 


గుండె ఆరోగ్యం

నిజానికి కౌగిలింత ఆరోగ్యకరమైన చర్య. ఎందుకంటే ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. పెన్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. వారి వారి భాగస్వాములను కౌగించుకునేవారికి  శారీరక స్పర్శలో అరుదుగా పాల్గొనే ఆడవారి కంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

సాన్నిహిత్యాన్ని పెంచుతుంది

ఒకరినొకరు బాగా ఇష్టపడే భాగస్వాములు తరచుగా కౌగిలించుకుంటారు. మీకు తెలుసా? ఈ కౌగిలి నేను సేఫ్ గా ఉన్న అనే భావనను కలిగిస్తుంది. మీతో వారు సురక్షితంగా ఉన్నారని ఫీలవుతారు. హగ్ మీలో ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హాన్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మీ మధ్య దూరాన్ని తగ్గించి రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. 
 

నొప్పుల నుంచి ఉపశమనం

వెబ్ఎండీ ప్రకారం.. కౌగిలి నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అవును గాయం తర్వాత భాగస్వామిని కౌగిలించుకుంటే అంతగా నొప్పి పుట్టదట. ఎందుకంటే కౌగిలింతతో రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ నొప్పి సంకేతాలను నిరోధించడానికి సహాయపడుతుంది. 

hugs

మంచి నిద్ర

మీకు ఇష్టమైన వారి కౌగిలిలో మీరు సురక్షితంగా భావిస్తే మీరు ప్రశాంతంగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేసినప్పుడు మీకు సంతోషం పెరిగి బాగా నిద్రపోతారు. 

Latest Videos

click me!