ఇలా తింటే మీరెంత ప్రయత్నించినా బరువు తగ్గరు

Published : Jul 15, 2023, 04:41 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా తింటూ, ఆలస్యంగా నిద్రపోతున్నారు. కానీ ఈ అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మీ జీర్ణవ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడానికి దారితీస్తాయి. 

PREV
15
ఇలా తింటే మీరెంత ప్రయత్నించినా బరువు తగ్గరు

మనరోజు వారి జీవితంలో ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. ఇవి చూడటానికి సాధారణమే అనిపించినా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. అలాగే డిన్నర్ సమయంలో కూడా ఆరోగ్యాన్ని పాడు చేసే ఎన్నో పొరపాట్లు కూడా చేస్తుంటాం. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ నిద్రను కూడా పాడుచేస్తుంది. మీరు చేసే ఈ పొరపాట్లే మిమ్మల్ని ఊబకాయానికి గురిచేస్తాయి. అసలు భోజనంలో ఎలాంటి తప్పులు చేస్తే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

25
Weight Loss

రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటు

రాత్రి పడుకోవడానికి 1:30 నుంచి 2 గంటల ముందు రాత్రి భోజనం చేయడం మంచిది. ఇలా తింటే మీ జీర్ణవ్యవస్థకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగిన సమయం లభిస్తుంది. ఇది శరీర కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. రాత్రి గడిచేకొద్దీ మన జీవక్రియ మందగిస్తుంది. అందుకే మీరు ఎంత త్వరగా రాత్రి భోజనం చేస్తే అది మీ జీర్ణక్రియ, బరువు తగ్గడానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. 
 

35

రాత్రి భోజనంలో ఎక్కువగా తినడం

రాత్రిపూట వీలైనంత తక్కువగా తినాల. తేలికపాటి భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే సలాడ్లు, సూప్లు, గ్రిల్డ్ వెజిటేబుల్స్ వంటివి తినండి. 
 

45
weight loss

తగినంత ప్రోటీన్, ఫైబర్ లభించకపోవడం

మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ భోజనంలో తగినంత ప్రోటీన్, ఫైబర్ ఉండేట్టు చూసుకోవాలి. మీరు ఈ పోషకాలను సరిగ్గా తీసుకోకపోతే  అది మీ జీవక్రియను నేరుగా ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ ను జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ శక్తి అవసరం. దీనివల్ల శరీరం కార్బోహైడ్రేట్లు, కొవ్వులను జీర్ణం చేయడం కంటే ఎక్కువ కొవ్వును కరిగిస్తుంది. ప్రోటీన్,  ఫైబర్ రెండూ మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల మీరు రాత్రిపూట ఎక్కువగా తినలేరు. 

55
Weight Loss

తీపి ఆహారాలు

చాలా మంది రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలను తింటుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా చక్కెరను తీసుకుంటే. ఎందుకంటే చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు ఇంకా ఇంకా తినేలా చేస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా బాగా పెంచుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు స్వీట్లను తినకుండా ఉండండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories