అందంగా కనిపించాలని మనం ఎన్నో రకాల బట్టలను వేసుకుంటూ ఉంటాం. బట్టలు మనల్ని వేడి, చలి నుంచి ఎంతో రక్షిస్తాయి. డ్రెస్సులను వేసుకుంటే మీరు అందంగా కనిపించడంతో పాటుగా సౌకర్యవంతంగా ఫీలవ్వడం కూడా ముఖ్యమే. కానీ కొన్ని రకాల డ్రెస్సులు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి డ్రెస్సులను వేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
టైట్ డ్రెస్సులు
ప్రస్తుత కాలంలో చాలా మంది టైట్ డ్రెస్సులనే వేసుకుంటున్నారు. జీన్స్ నుంచి బెల్టులు, కంప్రెషన్ ఇన్నర్స్ వరకు టైట్ గా శరీరానికి అత్తుక్కపోయే వాటినే ఎంచుకుంటున్నారు. కానీ ఇలాంటి దుస్తులు మీ ఆరోగ్యాన్నిదెబ్బతీస్తాయి. ఇంట్రాగాస్ట్రిక్ ప్రెజర్ లేదా ఇంట్రా-ఉదర పీడనం అని పిలువబడే కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి. టైట్ డ్రెస్సులను వేసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట వస్తుంది.
బాడీ షేపర్లు
ప్రస్తుతం జీవన శైలి పూర్తిగా మారింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి వంటి ఎణ్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించకూడదని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ వంటి బాడీ షేపర్లను ఉపయోగిస్తుంటారు. ఫిగర్ బాగుండాలని వీటిని ఉపయోగిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కింది ఉదర ప్రాంతం, పై తొడపై టైట్ బట్టలు మెరాల్జియా పరేస్తేటికా అని పిలువబడే సమస్యకు కారణమవుతాయి. ఇది తొడల చుట్టూ ఉన్న నరాలలో చికాకును, నొప్పిని, జలదరింపును కలిగిస్తుంది.
టైట్ టై, షర్ట్
ఆడవాళ్లే కాదు మగవారు కూడా టైట్ డ్రెస్సులను వేసుకుంటున్నారు. టైట్ గా ఉంటే టై వల్ల మెడదగ్గర రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. స్ట్రోక్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పరిశోధకులు 40 మంది ఆరోగ్యకరమైన పురుషులపై టైట్ టై ప్రభావం గురించి తెలుసుకోవడానికి నెక్టీ పరికరాన్ని ఉపయోగించారు. ఇది స్ట్రోక్ కు కారణమయ్యే సెరెబ్రోవాస్కులర్ రియాక్టివిటీలో మార్పును కనుగొంది.
ఇబ్బంది కలిగించే దుస్తులు
కొన్ని రకాల డ్రెస్సులు అలెర్జీని, చికాకును కలిగించే అవకాశం ఉంది. అందుకే డ్రెస్సులు కొనేటప్పుడు మీకు సౌకర్యవంతంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఉన్ని దుస్తులు అలెర్జీలను కలిగిస్తాయి. దీనిని సాధారణంగా కాంటాక్ట్ డెర్మటైటిస్ అని అంటారు.
సింథటిక్ ఫ్యాబ్రిక్
చాలా మంది ఎక్కువగా సింథటిక్ డ్రెస్సులనే కొంటుంటారు. కానీ సున్నితమైన చర్మం ఉన్నవారికి, తామర చరిత్ర ఉన్నవారికి ఈ దుస్తుల వల్ల చికాకు కలుగుతుంది. నిజానికి సింథటిక్ డ్రెస్సులు సాధారణంగా అలెర్జీ ఉన్నవారికి ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే సాక్స్, లోదుస్తులు, బ్రాపై రబ్బరు కారణంగా కొంతమందికి దద్దుర్లు అవుతుంటాయి. ఇన్నర్స్ లో ఉపయోగించే నైలాన్, లైక్రా వంటి సింథటిక్ ఫైబర్స్ కూడా సమస్యలను కలిగిస్తాయి.