ఇదొక్కటి తీసుకుంటే చాలు.. ఇట్టే బరువు తగ్గిపోతారు.. కాకపోతే?

Published : Mar 31, 2022, 02:38 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు (Overweight). శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ కారణంగా బరువు పెరిగి అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటున్నారు.  

PREV
18
ఇదొక్కటి తీసుకుంటే చాలు.. ఇట్టే బరువు తగ్గిపోతారు.. కాకపోతే?

అయితే అధిక బరువు సమస్యలను తగ్గించడానికి ఆహార జీవనశైలిలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  
 

28

వెల్లుల్లి: శరీర కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గించడానికి వెల్లుల్లి (Garlic) దివ్యౌషధంగా సహాయపడుతుంది. దీనిలో అల్లిసిన్ సమ్మేళనం (Allicin compound) ఉంటుంది. ఇది కొవ్వులు, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజులో ఎక్కువగా వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

38

గుడ్డు: గుడ్డులో (Egg) ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటితో పాటు మాంసకృత్తులు (Proteins) మెండుగా ఉంటాయి. కనుక గుడ్డును తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. కనుక రోజూ ఉదయం ఒక గుడ్డును తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడ కరిగి ఆరోగ్యంగా ఉంటారు.
 

48

పాలకూర: పాలకూరలో (Lettuce) పోలిక్ ఆమ్లం, ఇనుము, విటమిన్ సి, కాల్షియం వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే పోషకాలను (Nutrients) మాత్రమే శరీరానికి అందిస్తుంది, కెలొరీలను కాదు. కనుక బరువు తగ్గాలనుకునేవారు పాలకూరను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
 

58

పండుమిర్చి: పండుమిర్చిలో (Chilies) కాప్సియన్ (Capsian) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతుంది. కనుక పండుమిర్చిని తిన్న  పదిహేను నిమిషాలకే కేలరీలను కరిగిస్తుంది. కాబట్టి వండుకునే వంటలలో పచ్చిమిర్చిలను ఉపయోగిస్తే జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
 

68

యాపిల్: యాపిల్ (Apple) కరిగే ఫైబర్ (Fiber) ను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించడానికి దోహదపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు యాపిల్ ను డైట్ లో చేర్చుకుంటే మంచిది.
 

78

చేపలు: చేపలలో (Fish) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే చేపలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కనుక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే చేపలను వారంలో రెండు సార్లు తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు బరువు అదుపులో ఉంటుంది.
 

88

అలాగే వీటితో పాటు ఓట్స్, బ్రోకలీ, సిట్రస్ పండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, స్వీట్ పొటాటో, ముడి కూరగాయల ముక్కలు, నట్స్, దాల్చిన చెక్క, గ్రీన్ టీ లను తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం (Fat percentage) పెరగకుండా అడ్డుకుంటాయి.  ఈ హెల్తీ ఆహారపదార్థాలను (Healthy foods) డైట్ లో చేర్చుకుంటే బరువు అదుపులో ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

click me!

Recommended Stories