బీరకాయ పల్లీ మసాలా రెసిపీ.. ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా?

Published : Mar 30, 2022, 04:34 PM IST

బీరకాయలు (Ridge Gord) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉంటాయి.  

PREV
17
బీరకాయ పల్లీ మసాలా రెసిపీ.. ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా?

కనుక వేసవిలో బీరకాయతో చేసుకునే వంటలు వండుకుంటే శరీర వేడి తగ్గి చల్లదనం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం బీరకాయ పల్లీమసాలా (Birakaya Pallimasala) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: అరకేజీ బీరకాయలు (Ridge Gord), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), మూడు ఉల్లిపాయలు (Onions), ఒక టమోటా (Tomato), సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు కరివేపాకు (Curry) రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర (Coriyander) తరుగు, పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

37

మసాలా కోసం: సగం కప్పు పల్లీలు (Villages), ఒక టేబుల్ స్పూన్ సోంపు (Anise), పావు కప్పు కొబ్బరి తురుము (Coconut grater), ఒక టేబుల్ స్పూన్ ధనియాలు (Coriander), ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (Cumin, ఐదు యాలకులు (Cardamom), నాలుగు లవంగాలు (Cloves), ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క (Cinnamon), ఐదు జీడిపప్పు (Cashew), నాలుగు ఎండుమిర్చి (Dried chillies), ఒక టేబుల్ స్పూన్ గసగసాలు (Poppies).   
 

47

తయారీ విధానం: ముందుగా మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పల్లీలను వేసి దోరగా వేయించుకుని (Frying) పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి తురుము, సోంపు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, గసగసాలు, ఎండుమిర్చిలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మసాలా పదార్థాలను, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
 

57

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడేక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటా తరుగు, బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని (Mix well) వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కప్పు నీళ్లు (Water) పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
 

67

బీరకాయ ముక్కలు ఉడికిన తరువాత ముందుగా గ్రైండ్ చేసుకొన్న మసాలా పొడిని వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. కూర బాగా దగ్గరకు అయ్యాక కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే బీరకాయ పల్లీ మసాలా రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కూరను ట్రై చేయండి. ఈ కూర చాలా టేస్టీ (Tasty) గా ఉంటుంది.
 

77

కూర తయారీలో ఉపయోగించే బీరకాయలు, పల్లీలు శరీరానికి శక్తినందించే మంచి పౌష్టిక పదార్థాలు (Nutrients). ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలను వంటలలో చేర్చుకొని వెరైటీగా వండుకుంటే కుటుంబ సభ్యులు తినడానికి ఇష్టపడతారు. అలాగే వారి ఆరోగ్యం (Health) కూడా మెరుగుపడుతుంది.

click me!

Recommended Stories