రుచికరమైన మసాలా పన్నీర్ క్యాప్సికమ్ ఎలా తయారు చెయ్యాలో తెలుసా?

First Published Nov 25, 2021, 4:20 PM IST

ఉత్తర భారతదేశంలో ఎక్కువగా  మసాలా పన్నీర్ క్యాప్సికం తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. వేడివేడి రోటీలతో తినడానికి ఈ సబ్జీ బాగుంటుంది. పన్నీర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. రుచికరమైన మసాలా పన్నీర్ పిల్లలకు చాలా నచ్చుతుంది. పన్నీర్ తో అనేక రకాల సబ్జీలు చేస్తారు. పన్నీర్ తో ఏ వంట చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. మసాలా పన్నీర్ క్యాప్సికం రెసిపి ఇంట్లో సులభంగా తొందరగా తయారుచేసుకోవచ్చు. ఈ సబ్జీని చూడగానే కడుపు నిండిపోయేంత కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా మసాలా పన్నీర్ క్యాప్సికం (Masala paneer capsicum) తయారీ గురించి తెలుసుకుందాం.
 

మసాలా పన్నీర్ క్యాప్సికం సబ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: 200 గ్రాముల పన్నీర్ (Paneer), రెండు పెద్ద ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomato), ఒక క్యాప్సికం (Capsicum), నూనె (Oil), కొద్దిగా నిమ్మరసం  (Lemon juice), సగం స్పూన్ పసుపు (Turmeric), సగం టేబుల్ స్పూన్ కారం (Red chilli powder).
 

రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ జీలకర్ర (Cumin), 2 లవంగాలు (Cloves), రెండు యాలకలు (Cardamom), ఒక బిర్యానీ ఆకు (Bay leaf), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger garlic paste), సగం స్పూన్ ధనియాలపొడి (Coriyander powder), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ గరంమసాలా (Garam masala).
 

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కట్ చేసుకున్న పన్నీర్ (paneer) ముక్కలను తీసుకుని పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాండ్లీ పెట్టి అందులో పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ (Capsicum), ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి దొరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
 

ఇందులోనే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి దోరగా ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే బాండ్లీలో మరికొంత పోపుకు సరిపడా ఆయిల్ (Oil) వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, లవంగాలు, యాలకలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ పేస్టు (Onion paste) వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ కలుపుతుండాలి.
 

ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటో పేస్ట్ (Tomato paste) వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి అయిదు నిమిషాలు (Five minutes) ఉడికించుకోవాలి.
 

మసాలా అంతా దగ్గరపడ్డాక మరొక సారి కలిపి క్యాప్సికం, పన్నీర్, ఉల్లిపాయముక్కలు వేసి కలుపుకోవాలి. మరల కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాను ఒక గిన్నెలో (Bowl) తీసుకోవాలి. వీటిని రోటీలతో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ క్యాప్సికం మసాలా రెడీ.

click me!