గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ మసాలా కూరను ఇలా వండితే రుచి అదిరిపోతుంది!

Published : May 18, 2022, 03:52 PM IST

గుత్తి వంకాయ మసాలా కూరంటే ఆంధ్రులకు చాలా ఇష్టం. ఈ కూరను గుంటూరు స్టైల్ లో వండుకుంటే చాలా స్పైసీగా (Spicy), భలే రుచిగా (Delicious) ఉంటుంది.  

PREV
17
గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ మసాలా కూరను ఇలా వండితే రుచి అదిరిపోతుంది!

ఈ కూర తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ మసాలా కూరను ఎలా వండుకోవాలో తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: పది వంకాయలు (Brinjals), సగం కప్పు వేరుశనగలు (Peanuts), రెండు టేబుల్ స్పూన్ ల ధనియాలు (Coriander), రెండు టేబుల్ స్పూన్ ల ఎండు కొబ్బరి (Dried coconut) తురుము, ఐదు లవంగాలు (Cloves), కొంచెం దాల్చిన చెక్క (Cinnamon), ఒక టీస్పూన్ మిరియాలు (Pepper), సగం కప్పు ఎండుమిరపకాయలు (Dried chillies).
 

37

సగం టీ స్పూన్ మెంతులు (Fenugreek), పావు కప్పు నువ్వులు (Sesame seeds), రెండు టీ స్పూన్ ల గసగసాలు (Poppies), ఒక టీ స్పూన్ ఆవాలు (Mustard), ఒక టీ స్పూన్ జీలకర్ర (Cumin), కొన్ని కరివేపాకులు (Curries), ముప్పావు కప్పు చింతపండు రసం (Tamarind juice), రుచికి సరిపడ ఉప్పు (Salt), కొత్తిమీర (Coriander) తరుగు, సగం కప్పు నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేరుశెనగలను వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఇందులో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుకొబ్బరి తురుము, మిరియాలు, మెంతులను వేసి తక్కువ మంట (Low flame) మీద వేపుకోవాలి. తరువాత ఎండు మిరపకాయలు వేసి వేపుకుని (Frying) ప్రక్కన పెట్టుకోవాలి.
 

57

ఇప్పుడు నువ్వులు, గసగసాలను కూడా వేసి వేపుకుని చిటపటలాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసి నీళ్లు వేయకుండా (Without watering) మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిలో రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
 

67

ఇప్పుడు వంకాయలను తీసుకుని గాట్లు పెట్టుకుని ఉప్పు నీటిలో (Salt water) వేయాలి. తరువాత వంకాయలలో మసాలా పొడిని కూర్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేగిన తరువాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులను వేసి వేపుకుని స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసి తక్కువ మంట మీద మూతపెట్టి వేయించుకోవాలి.
 

77

వంకాయలు 80 శాతం మగ్గిన తరువాత చింతపండు రసం, వంకాయలలో స్టఫింగ్ (Stuffing) చేయగా మిగిలిన మసాలా పౌడర్ ను కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు చింతపండు రసం వంకాయలకు పట్టేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ గుత్తి వంకాయ (Gutti vankaya) మసాలా కూర రెడీ.

click me!

Recommended Stories