త్వరగా గర్భం దాల్చాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతులు ఇవే!

Published : May 18, 2022, 03:13 PM IST

చాలా మంది దంపతులు సంతాన సమస్యలను ఎదురకొంటున్నారు.. ఇలా జరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
18
త్వరగా గర్భం దాల్చాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతులు ఇవే!

పెళ్ళై సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టకపోవడానికి కారణం జీవనశైలిలో మార్పులు, ఆలస్యంగా జరిగే వివాహాలు, తగినంత పోషకాహార లోపం, మహిళల్లో ఋతుక్రమ సమస్యలు, మగవారిలో లైంగిక సమస్యలు ముఖ్య కారణాలు (Causes). ఇలా పలు రకాల కారణాలతో గర్భధారణ (Pregnancy) ఆలస్యమవుతుంది. మరి త్వరగా గర్భం దాల్చాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

వివాహం తరువాత దంపతులిద్దరూ వారి సంతానం కోసం ఎన్నో కలలు కంటారు. కానీ గర్భధారణ ఆలస్యమైతే నెలల, సంవత్సరాలు తరబడి వేచి ఉండడంతో వారిలో అసహనం (Impatience) అనిపిస్తుంది. దీంతో వారు ఆత్మవిశ్వాసాన్ని (Confidence) కోల్పోతారు. అయితే త్వరగా గర్భధారణ జరగాలంటే వారి జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు అంటున్నారు.
 

38

గర్భం త్వరగా రావాలంటే మహిళలలో ఆరోగ్యకరమైన ఋతుచక్రం (Menstrual cycle) చాలా ముఖ్యం. నెలసరి ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ముగుస్తుందో గుర్తించుకోవాలి. అలాగే ఋతుక్రమంలో ఏమైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఋతుక్రమం సక్రమంగా రావడానికి బలమైన ఆహారాన్ని (Strong diet) తీసుకోవాలి.
 

48

ఋతుస్రావం తరువాత 12 నుంచి 16 రోజులలోపు అండం విడుదలవుతుంది. ఈ సమయంలో ఫలదీకరణకు (Fertilization) చాలా ఉత్తమమైన సమయం. ఈ సమయంలో వీలైనంత ఎక్కువ సార్లు భాగస్వామితో లైంగిక చర్యలో (Sexual activity) పాల్గొంటే త్వరగా గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అంగం యోని లోపలకు బాగా ప్రవేశించే రతి భంగిమలను ప్రయత్నించాలి. 

58

దంపతులిద్దరూ కలిసి సంతృప్తికరమైన  రతిక్రియను ఆస్వాదించాలి. సంతృప్తికరమైన (Satisfactory) రతి చర్య గర్భధారణకు సహాయపడుతుంది. రతిలో పాల్గొనేటప్పుడు పురుషుడు వీర్యాన్ని లోతుగా గర్భ ద్వారం వద్ద పడేలా స్కలనం చేస్తే భాగస్వామి త్వరగా గర్భం దాల్చుతుంది. అలాగే వీర్య స్కలనం తర్వాత వెంటనే అంగాన్ని తీయకుండా కొద్దిసేపు యోనిలోనే (Vagina) ఉంచుకోవాలి. 

68

శరీరంలో జరిగే రక్త ప్రసరణ (Blood circulation) మీద కూడా గర్భధారణ ఆధారపడి ఉంటుంది. కనుక రోజులో కొద్ది సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో శరీరంలోని అన్ని అవయవాలతో పాటు జననాంగాలకు కూడా రక్త సరఫరా మెరుగుపడి నాణ్యమైన వీర్యం (Semen) ఉత్పత్తి కావడంతో గర్భధారణ త్వరగా జరుగుతుంది.
 

78

గర్భధారణ ఆలస్యం కావడానికి ప్రతి రోజూ తీసుకునే ఆహారంలోని పోషకాలలోపం (Malnutrition) కూడా ముఖ్య కారణం. కనుక ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవడం మంచిది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. శరీరంలోని హార్మోన్ (Hormone) ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తిని రెట్టింపు చేయడానికి ప్రతిరోజూ పాలను తీసుకోవాలి.
 

88

స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సమస్యలు (Sexual problems) కూడా గర్భధారణను ఆలస్యం చేస్తాయి (Delay pregnancy). ఈ సమస్యలు తగ్గి, నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసి, సంతానోత్పత్తిని పెంచేందుకు వెల్లుల్లి, దానిమ్మ, గుడ్డు, పుచ్చకాయ, అంజీర వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మీ గర్భధారణకు సంబంధించి ఎటువంటి సమస్యలైన ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది. వారి సలహా మేరకు సరైన చికిత్స తీసుకుంటే త్వరగా గర్భం దాల్చవచ్చు.

click me!

Recommended Stories