గోధుమ రవ్వ ఇడ్లీలు ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా?

Navya G   | Asianet News
Published : Mar 03, 2022, 02:41 PM IST

గోధుమ రవ్వ ఆరోగ్యానికి (Health) మంచిది. గోధుమ రవ్వ ఇంట్లో అందుబాటులో ఉంటే మనం ఎక్కువగా ఉప్మానే చేసుకుంటాం. అయితే ఈసారి ఉప్మాకు బదులుగా ఇడ్లీలను ట్రై చేయండి.  

PREV
16
గోధుమ రవ్వ ఇడ్లీలు ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా?

గోధుమ రవ్వతో చేసుకునే ఇడ్లీలు రుచిగా ఉంటాయి. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో చేసుకునే ఇడ్లీల తయారీ విధానం కూడా సులభం. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇంకెందుకు ఆలస్యం గోధుమ రవ్వ ఇడ్లీల (Wheat Ravva Idli) తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

26

కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ రవ్వ (Wheat Ravva), ముప్పావు కప్పు పెరుగు (Curd), ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు (Chillies), పావు కప్పు క్యారెట్ (Carrot) తురుము, ముప్పావు స్పూన్ ఈనో సాల్ట్ (Eno Salt), సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), కరివేపాకు (Curry) రెబ్బలు, కొన్ని జీడిపప్పు (Cashew) పలుకులు, రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ సెనగపప్పు (Senagapappu). 
 

36

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి (Ghee) వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, జీడిపప్పు పలుకులు, కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత గోధుమ రవ్వను కూడా వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేయించుకున్న గోధుమరవ్వ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

46

గోధుమ రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, ఈనో సాల్ట్,  క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకుని మూతపెట్టి అరగంటపాటు పిండిని నాననివ్వాలి (Soak). అరగంటయ్యాక ఇడ్లీ పిండిలా అయ్యేందుకు మరికొన్ని నీళ్లు (Water) కలిపి మరో అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి.
 

56

గోధుమ రవ్వ మిశ్రమాన్ని నానబెట్టుకోవడంతో ఇడ్లీలు చాలా స్మూత్ గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి వాటిలో గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ (Ready). ఈ ఇడ్లీలను చట్నీ, సాంబార్ తో తీసుకుంటే భలే రుచిగా (Delicious) ఉంటాయి.
 

66

ఇంకెందుకు ఆలస్యం గోధుమ రవ్వతో మీరు కూడా ఒకసారి ఇడ్లీలను ట్రై చేయండి. గోధుమ రవ్వతో చేసుకునే ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (Healthy Breakfast) ను డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు వెరైటీ వంటలను (Variety of dishes) ట్రై చేస్తూ మీ పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు.

click me!

Recommended Stories