టేస్టీ టేస్టీ రోజ్ బర్ఫీ స్వీట్.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Navya G   | Asianet News
Published : Feb 28, 2022, 03:24 PM IST

తీపిపదార్థాలను శుభానికి సంకేతంగా భావిస్తారు. అందుకే పండుగలలోనూ, శుభకార్యాలలోనూ తీపి పదార్థం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు కాస్త వెరైటీగా రోజ్ బర్ఫీని (Rose Barfi) ట్రై చెయ్యండి. ఈ స్వీట్ ఐటమ్ చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రోజ్ బర్ఫీ స్వీట్ ఐటమ్ తయారీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
టేస్టీ టేస్టీ రోజ్ బర్ఫీ స్వీట్.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

ఈ రోజ్ బర్ఫీ చూడడానికి చాలా కలర్ ఫుల్ (Colorful) గా ఉంటుంది. తక్కువ పదార్థాలతో (With less ingredients) తక్కువ సమయంలో చేసుకునే ఈ బర్ఫీ తయారీ విధానం కూడా సులభం. ఈ బర్ఫీ రుచికి తిరుగుండదు. ఈ బర్ఫీని తినడానికి పిల్లలు, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. ఈ బర్ఫీని తయారు చేసి కుటుంబ సభ్యుల నోటిని తీపి చేస్తే బాగుంటుంది.
 

26

కావలసిన పదార్థాలు: రెండు లీటర్లు పాలు (Milk), ముప్పావు కప్పు కొబ్బరి తురుము (Coconut grater), నిమ్మకాయ (Lemon) ఒకటి, చిన్న డబ్బా కండెన్స్ డ్ మిల్క్ (Condensed milk), 3 టేబుల్ స్పూన్ ల రోజ్ సిరప్ (Rose syrup), ఒక స్పూన్ రోజ్ వాటర్ (Rosewater), కొన్ని పిస్తా (Pista) పలుకులు, రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి.
 

36

తయారీ విధానం: ఒక గిన్నెలో రెండు లీటర్ల పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి  వేడిచేయాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు (While boiling) స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలపాలి. పాలలో నిమ్మరసం వేస్తే పాలు విరుగుతాయి. ఇలా విరిగిన పాలను ఓ వస్త్రంలో వేసి నీటిని పూర్తిగా వడగట్టి పన్నీర్ తయారు చేసుకోవాలి.
 

46

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. కొబ్బరి తురుము వేగిన తరువాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రోజ్ సిరప్, కండెన్స్ డ్ మిల్క్, కొబ్బరి తురుము, రోజ్ వాటర్ పన్నీరు (Paneer) మిశ్రమం వేసుకుని బాగా కలుపుకోవాలి (Mix well).
 

56

10 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పరచాలి. ఈ మిశ్రమంపై పిస్తా పలుకులతో గార్నిష్ (Garnish) చేసుకోవాలి. ఈ ప్లేట్ ను రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టి ఆ తరువాత బయటకు తీసి మీకు ఇష్టమైన ఆకారంలో (Shaped) ముక్కలుగా కట్ చేసుకోవాలి.

66

అంతే ఎంతో రుచికరమైన రోజ్ బర్ఫీ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ ఐటమ్ ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎప్పటికప్పుడు వెరైటీ స్వీట్స్ (Variety Sweets) లను తయారు చేస్తూ పిల్లలకు ఇస్తే వారు ఏ పేచీ లేకుండా తినడానికి ఇష్టపడతారు.

click me!

Recommended Stories