నోరూరించే టేస్టీ మలీద లడ్డు, ఖర్జూరం నువ్వుల లడ్డూల తయారీ విధానం..

Navya G   | Asianet News
Published : Mar 02, 2022, 06:25 PM IST

మలీద లడ్డు (Malida Laddu), ఖర్జూరం నువ్వుల లడ్డూలు (Karjuram nuvvula laddu) ఆరోగ్యానికి ఎంతో మంచివి. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో చేసుకునే ఈ లడ్డూల తయారీ విధానం కూడా సులభం. ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

PREV
17
నోరూరించే టేస్టీ మలీద లడ్డు, ఖర్జూరం నువ్వుల లడ్డూల తయారీ విధానం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమపిండి (Wheat flour), మూడు స్పూన్ ల నూనె (Oil), పావు స్పూన్ సొంపు పొడి (Anise powder), రుచికి సరిపడ ఉప్పు (Salt), పావు స్పూన్ యాలకులపొడి (Cardamom powder), సగం కప్పు బెల్లం (Jaggery), పావు కప్పు నెయ్యి (Ghee), సగం స్పూన్ గసగసాలు (Poppies), సగం కప్పు ఎండుకొబ్బరి తురుము (Coconut grater).
 

27

తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమపిండి, నూనె, ఉప్పు (Salt) వేసి చపాతీ పిండిలా మరీ గట్టిగా లేదా మెత్తగా కాకుండా కలిపి పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత ఉండలు చేసి కాస్త మందంగా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి చపాతీని వేసి రెండు వైపులా నెయ్యితో (Ghee) చక్కగా కాల్చుకోవాలి.
 

37

ఇలా చేసుకున్న మొత్తం చపాతీలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం, కొబ్బరి తురుము, సోంపు పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని (Mix well) లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న లడ్డూలపై గసగసాలను చల్లుకుని గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంతే నోరూరించే మలీద లడ్డూలు రెడీ.
 

47

కావలసిన పదార్థాలు: ఒక కప్పు నువ్వులు (Seasame), పావు కప్పు గింజలు తీసిన ఖర్జూరం (Dates) ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు (Cashew) పలుకులు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), కొద్దిగా నెయ్యి (Ghee).
 

57

తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక కప్పు నువ్వులను వేసి రెండు టేబుల్ స్పూన్ ల నీళ్ళు చల్లుకుని తక్కువ మంటమీద (Low flame) కలుపుతూ వేయించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు చల్లారిన తరువాత పావు కప్పు నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నువ్వులను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. 
 

67

ఇప్పుడు మరలా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరాలను (Dates) వేసి ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుని రెండు టేబుల్ స్పూన్ ల జీడిపప్పు (Cashew) పలుకులు వేసి కలుపుకోవాలి.
 

77

తర్వాత నువ్వుల పొడి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. లడ్డు పొడి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. గుండ్రంగా చుట్టుకున్న లడ్డూలను నువ్వులలో ముంచి ఒక ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) హెల్తీ ఖర్జూరం నువ్వుల లడ్డు రెడీ (Ready).

click me!

Recommended Stories