జ్యూసీగా ఉండే మడత కాజా ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో తెలుసా?

First Published Nov 26, 2021, 2:49 PM IST

స్వీట్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అందులో మడత కాజా (Madata kaja) అంటే మరింత ఇష్టం ఉంటుంది. కాకినాడ అనే పేరు వినగానే మనకు మడతకాజా గుర్తొస్తుంది. ఈ మడత కాజాలు ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఈ మడత కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి. మడత కాజాలు పొరలు పొరలుగా జ్యూసీగా ఉండి తినడానికి బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా పొరలు పొరలుగా జ్యూసీగా ఉండే మడతకాజాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

మడతకాజాల తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా (Maida), చిటికెడు ఉప్పు (Salt), చిటికెడు వంటసోడా (Baking soda), 2 టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), కొంచెం యాలకుల పొడి (Cardamom powder), ఢీ ఫ్రై కి సరిపడా నూనె (Oil), ఒకటిన్నర కప్పు చక్కెర (Sugar). 
 

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మైదాపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు వంటసోడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). తరువాత కొంచెం కొంచెం నీళ్ళు పోసి పిండిని చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై తడి గుడ్డ (Wet cloth) వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
 

అరగంట తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చపాతీల పలుచగా తిక్కుకోవాలి. పొడి పిండి చల్లుతూ వీలైనంత పలుచగా తిక్కుకోవాలి. ఇలా పలుచగా (Thinner) చేసుకున్న చపాతీపై నూనె రాసి పొడి పిండి చల్లుకొని ఒక వైపు నుంచి మడుచుకుంటూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న పిండిని అరంగుళం చొప్పున కట్ చేసుకుంటూ కాజాల ఆకారంలో (Shape) ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.  
 

ఇప్పుడు చక్కెర పాకానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వేసి అరకప్పు నీళ్లు (Water) పోసి స్టౌ మీద పెట్టి పాకాన్ని (Caramel) తయారు చేసుకోవాలి. తీగపాకం లాగా వచ్చిన తరువాత ఇందులో యాలకుల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
 

ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కాజాలను వేసి మీడియం మంట (Medium flame) మీద  ఫ్రై చేసుకోవాలి. కాజాలు రెండు వైపులా బాగా కాలిన తరువాత తీసి వేడి వేడి పాకంలో వేయాలి. కాజాలను పాకంలో కొద్దిసేపు ఉంచి కాజాలను మరొక గిన్నెలోకి (Bowl) తీసుకోవాలి. అంతే పొరలు పొరలుగా జ్యూసీగా ఉండే మడత కాజాలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కాజాలు ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు సర్వ్ చేయండి.

click me!