ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ 65 రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో తెలుసా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 03, 2021, 06:18 PM IST

క్యాలీఫ్లవర్ 65 (Cauliflower 65) మంచి స్నాక్స్ ఐటమ్స్. దీన్ని పప్పు, సాంబార్ లకు సైడ్ డిష్ గా కూడా ఉపయోగిస్తుంటారు. ఏ ఫంక్షన్లకు వెళ్ళిన క్యాటరింగ్ వాళ్ళు కాలీఫ్లవర్ 65 ను స్పెషల్ సైడ్ డిష్ గా చేస్తుంటారు. ఈ రిసీపీని మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. తక్కువ సమయంలో ఎంతో సులభంగా తయారు చేసుకునే రెసిపీ ఇది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా (Article) క్యాలీఫ్లవర్ 65 తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
16
ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ 65 రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: 500gms క్యాలీఫ్లవర్ (Cauliflower), మూడు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour),  ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి (Rice flour), ఒక టీస్పూన్ కారం (Red chilly powder), ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), రుచికి సరిపడు ఉప్పు(Salt), ఒక టీస్పూన్ గరంమసాలా (Garam masala), కొత్తిమీర తరుగు (Chopped Coriyander), ఫుడ్ కలర్ (Food colour), నాలుగు  పచ్చిమిరపకాయలు (Green chillies), కరివేపాకు (Curries), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
 

26

తయారీ విధానం: ముందుగా ఒక క్యాలీఫ్లవర్ (Cauliflower) ను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ లో పురుగులు ఉంటాయి జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో (Bowl) నీటిని తీసుకొని స్టౌ మీద పెట్టి నీటిని మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో క్యాలీఫ్లవర్ ను వేసి ఒక నిముషం పాటు ఉడికించుకోవాలి.
 

36

ఉడికించుకున్న కాలీఫ్లవరు నీళ్లు లేకుండా ఒక ప్లేట్ (Plate) లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల మైదా, మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ ల బియ్యపిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, తరిగిన కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలర్ (Food colour) వేసి బాగా కలుపుకోవాలి.
 

46

ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు మీకు అవసరమైతే వేసుకోండి లేకుంటే లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు (Water) పోస్తూ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలను (Cauliflower slices) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
 

56

ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి తక్కువ మంట (Low flame) మీద కాలీఫ్లవర్ ను ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ మంచి కలర్ (Colour) వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ లోనే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
 

66

ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకులను ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ లో వేసి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న క్యాలీఫ్లవర్ ను ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ (Serve) చేయండి. అంతే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ 65 రెసిపీ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories