అందమైన చర్మ సౌందర్యం కోసం అవోకాడోతో ఓసారి ఇలా ట్రై చెయ్యండి!

First Published Dec 3, 2021, 5:33 PM IST

అందంగా కనిపించాలనేది అందరి ఆకాంక్ష. దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లను వాడుతుంటారు. వీటి వాడకం మంచిది కాదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. సహజసిద్ధమైన ఫేషియల్ ను ఉపయోగించడం మంచిదని తెలుపుతున్నారు. అందులోనూ అవోకాడోతో (Avocado) చేసిన ఫేస్ ప్యాక్ చర్మ సౌందర్యానికి మంచిదని తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అవోకాడోతో ఫేస్ ప్యాక్ లను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
 

అవోకాడో ఆరోగ్యానికి మేలు కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అవోకాడోలో మోనోశాచ్యురేటెడ్ (Monosaturated) అనే కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. ఇది పొడిబారిన చర్మాన్ని తగ్గించి తగినంత తేమను అందించి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. ముఖంపై ఏర్పడే మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలు, మృతకణాలను (Dead cells) నివారిస్తాయి. 
 

ముఖాన్ని చాలా సున్నితంగా మార్చేస్తుంది. అవోకాడోను చర్మానికి అప్లై చేసుకోవడంతో చర్మంలోని వృద్ధాప్య ఛాయలను (Aging shades) తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇది చలికాలంలో ఏర్పడే చర్మ సమస్యలను (Skin problems) తగ్గిస్తుంది. పెదాల పగుళ్ళను, చీలికలను, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దీన్ని పెదాలకు అప్లై చేయడంతో పెదాలు సున్నితంగా, తడిగా, గులాబి రంగులోకి మారుతాయి.

అవోకాడో మంచి మాయిశ్చరైజర్గా (Moisturizer), వాసెలైన్ (Vaseline) గా పనిచేస్తుంది. స్కిన్ డ్యామేజ్ లను పోగొడుతుంది.  ఇది ఒక అద్భుతమైన ఉత్తమమైన స్కిన్ కేర్ ఫ్రూట్ అని తేల్చారు. అవోకాడోతో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి చక్కగా పనిచేస్తాయి. వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

అవోకాడో-బొప్పాయి ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో ఉడికించిన అవోకాడో గుజ్జును (Avocado pulp) తీసుకుని అందులో బాగా పండిన బొప్పాయి గుజ్జును (Papaya pulp) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.   
 

అవోకాడో ఫేస్ ప్యాక్: ఒక గిన్నె తీసుకొని అందులో అవోకాడో గుజ్జు (Avocado pulp), పంచదార (Sugar), పాలు (Milk), తేనే (Honey) వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ అవోకాడో ఫేస్ ప్యాక్ (Avocado Face Pack) చర్మంలోని  మృత కణాలను నశింపచేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
 

అవోకాడో స్టోన్ మసాజ్: అవోకాడో గుజ్జును  (Avocado pulp), ముఖానికి అప్లై చేసుకొని స్పాస్టోన్ (Spastone) తో బాగా మర్ధన చేయాలి. ఇలా చేయడంతో ముఖ కణాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం శుభ్రపడి కాంతివంతంగా మారుతుంది.

click me!