అరటిపండు హాల్వా ఎప్పుడైనా తిన్నారా.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

First Published Oct 31, 2021, 3:58 PM IST

అరటి పండు (Banana) ఆరోగ్యానికి మంచిది. అరటిపండుతో మీరు ఇంత వరకూ రకరకాల ఫ్రూట్ సలాడ్స్ (Fruit salad), జ్యూస్ (Juices) లు ట్రై చేసి ఉంటారు. అయితే మీకు అరటి పండు తో హల్వా కూడా చేయొచ్చని తెలుసా. అరటి పండు తినడానికి ఇష్టపడని పిల్లలకు ఈ విధంగా అరటి పండు హల్వా చేసి పెడితే వారు తినడానికి ఇష్టపడతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ ద్వారా అరటిపండు హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..
 

అరటి పండు ఆరోగ్యానికి మంచిది. అరటి పండుతో చేసుకునే ఈ హల్వా ఒక మంచి హెల్తి స్వీట్ (Healthy sweet). ఇప్పటివరకు మీరు అరటిపండుతో రకరకాల జ్యూసులు, పచ్చి అరటిపండుతో వంటలు చేసి ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఎంతో సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకునే హల్వాని (Halwa) ట్రై చేసి చూడండి. దీన్ని మీ పిల్లలకు పెట్టారంటే వారు ఎంతగానో ఇష్టపడతారు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకోండి. 
 

అరటిపండు హల్వా తయారీకి కావలసిన పదార్థాలు: అరటిపండు హల్వా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మూడు తాజా అరటి పండ్లు (Bananas), ఒక కప్పు బొంబాయి రవ్వ (Ravva), సగం కప్పు నెయ్యి (Ghee), ఒక కప్పు పంచదార (Sugar), నీళ్లు (Water), యాలకుల పొడి (Elachi powder), కాజు (Cashews), బాదం (Almonds), ఎండు ద్రాక్ష (Raisins).
 

అరటిపండు హల్వా కోసం ముందు ఒక గిన్నెలో అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని చిదిమి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో కాజు (Cashews) బాదం (Almonds) , ఎండు ద్రాక్షలను (Raisins) వేసి దోరగా వేయించాలి.
 

ఇలాగ వేయించిన డ్రై ఫ్రూట్స్ ను పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అదే బాండ్లీ లో సగం కప్పు నెయ్యి (Ghee) వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత  అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ (Ravva) వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ కలర్ వచ్చాక అందులో రెండు కప్పుల నీళ్లు వేసి రవ్వ (Ravva) ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.
 

ఐదు నిమిషాల తర్వాత ఒక కప్పు పంచదార వేసి కలపాలి. పంచదార  (Sugar) బాగా కరిగిన తర్వాత యాలకల పొడి (Elachi powder), అరటిపండు (Banana) ముక్కలను వేసి మరొకసారి కలపాలి. చివరిలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ను వేసి ఇంకొకసారి కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
 

హల్వాను ఒక గిన్నెలో పెట్టి డ్రై ఫ్రూట్స్ (Dry fruits) తో కలర్ ఫుల్ గా గార్నిష్ (Garnish) చేయాలి. ఇంకేంటి  ఎంతో సులభంగా తయారు చేసుకునే హెల్తీ అరటి పండు హల్వా రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అరటిపండు హల్వాని తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి వారు ఈ హల్వాను ఎంతగానో ఇష్టపడతారు.

click me!