పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ కి బదులుగా దీనిని ఉపయోగిస్తే చాలు!

Navya G   | Asianet News
Published : Feb 28, 2022, 01:53 PM IST

ఆడవారిలో ప్రతినెలా వచ్చే పిరియడ్స్ (Periods) చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి. రక్తస్రావాన్ని (Bleeding) అదుపుచేయడానికి ప్యాడ్స్ ను ఉపయోగిస్తుంటారు. సానిటరీ నాప్కిన్ ప్లాస్టిక్ తో తయారు చేయబడిన ఈ ప్యాడ్స్ అనేక హానికర రసాయనాలను కలిగి ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. మరి పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావాన్ని అదుపు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా! అయితే ప్యాడ్స్ కి బదులుగా దేనిని ఉపయోగించాలో తెలుసుకుందాం..   

PREV
16
పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ కి బదులుగా దీనిని ఉపయోగిస్తే చాలు!

పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ప్యాడ్స్ అసౌకర్యంగా (Uncomfortable) ఉండి ఎలర్జీ   లతోపాటు ఇతర సమస్యలకు కారణమవుతాయి. ప్యాడ్స్ కి బదులుగా మెనుస్ట్రువల్ కప్ (Menstrual cup) ను ఉపయోగించడం మంచిదని వైద్యులు అంటున్నారు. మెనుస్ట్రువల్ కప్‌ని సిలికాన్ తో తయారు చేస్తారు. ఇది ప్యాడ్స్ కంటే ఎక్కువగా రక్తస్రావాన్ని కంట్రోల్ చేయగలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.మెనుస్ట్రువల్ కప్‌ని 10-12 గంటల వరకు వాడవచ్చు.

26

కాబట్టి ప్రస్తుత కాలంలో మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒకవేళ మీరు మెనుస్ట్రువల్ కప్‌ని వాడాలనుకుంటే ఒకసారి గైనకాలజిస్ట్ (Gynecologist) ను  సంప్రదించడం మంచిది. మెనుస్ట్రువల్ కప్‌ లో స్మాల్, లార్జ్ రెండు సైజులు అందుబాటులో ఉంటాయి. మీకు ఏ సైజు సరిపోతుందో గైనకాలజిస్ట్ ను సంప్రదించి తెలుసుకుని ఆ సైజ్ (Size) ను కొనుక్కోండి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం జరిగితే 10-12 మెనుస్ట్రువల్ కప్‌ నిండిపోతే తీసేయాలి. లేకపోతే లీక్ అవుతుంది. 

36

మెనుస్ట్రువల్ కప్‌ ను వాడే విధానం: దీన్ని ఎలా వాడాలంటే ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత కప్ అంచులను నీటితో తడపాలి. అంచులు పైకి ఉండేలా కప్‌ని ఒక చేతితో మడిచి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్‌ని నెమ్మదిగా యోని (Vagina) లోపలికి ఇన్‌సర్ట్ (Insert) చేయాలి. కప్‌ లోపలికి పెట్టిన తరువాత అటూ ఇటూ తిప్పాలి. మీరు సరిగ్గా ఇన్సర్ట్ చేసి ఉంటే లోపల కప్ ఉందనే ఫీల్ రాకూడదు. లోపల ఏదో ఉందని అనిపించదు. ఎప్పటిలానే అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు.
 

46

ఎలా బయటకు తీయాలి: కప్ ను బయటికి తీయడానికి ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు బొటన వేలు, చూపుడు వేలు యోనిలోకి పెట్టి కప్ కింది మొన భాగాన్ని పట్టుకొని నెమ్మదిగా లాగాలి (Pull slowly). గట్టిగా నొక్కితే సీల్ ఓపెన్ అవుతుంది. కనుక నెమ్మదిగా కిందికి లాగాలి. ఇప్పుడు కప్ బయటకు తీసి తర్వాత బ్లడ్ క్లీన్ (Clean) చేయాలి. ఇలా రోజుకు కనీసం రెండు సార్లు కప్ ను మార్చవలసి ఉంటుంది.

56
periods

ఉపయోగాలు: మెన్స్ట్రువల్ కప్‌ దీర్ఘకాలంలో ఉపయోగించే ప్యాడ్స్ కంటే చౌకైనది. దీన్ని తరచుగా మార్చవలసిన అవసరం లేదు. ఎక్కువ గంటలపాటు ఉపయోగించవచ్చు. ప్యాడ్స్ కంటే  మెనుస్ట్రువల్ కప్‌ సౌకర్యంగా (Comfortable) ఉంటుంది. పిరియడ్ సమయంలో ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ అసౌకర్యంగా ఉండి చికాకు కలిగిస్తాయి. మెనుస్ట్రువల్ కప్‌ ను ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందులు (Difficulties) లేకుండా ఉంటుంది. 

66
periods

పీరియడ్స్ సమయంలో ప్యాడ్ తడిగా, అసౌకర్యంగా ఉండి చర్మానికి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. కానీ దీన్ని ఉపయోగిస్తే పీరియడ్ వచ్చిందన్న భావన కూడా కలగదు. సానిటరీ ప్యాడ్స్ లాగా ప్రతిరోజు దీన్ని పారవేయవలసిన అవసరం లేదు. దీని కారణంగా పర్యావరణ కాలుష్యం (Environmental pollution) కూడా తగ్గుతుంది. ఈ కప్ ను ఉపయోగిస్తే యోని భాగం ఆరోగ్యంగా (Healthy), పరిశుభ్రంగా ఉంటుంది.

click me!

Recommended Stories